పుట్టిన ప్రతి మనిషి తప్పక దేవుడు అనే దాని గురించి ఆలోచించి మాత్రమె భక్తి చేయాలి. ఎందుకంటే, దేవుడు గురించి మనిషికి ఎంతో కొంత అవగాహన ఉంది. కాని, మనిషికి అవగాహన లేని అంశం ఏంటంటే, దుష్టుడైన సైతాన్ మరియు వాని సైన్యం. వీడు ఒక పెద్ద మోసగాడు. మనుష్యులను ఆ ఏకైక దేవునికి దూరం చేయడానికి ఎంతకైనా తెగించే మోసగాడు. భూమి పుట్టిననాటి నుండి, మనిషిని అలాగే మోసం చేస్తూ, ఆ ఏకైక దేవునికి నెమ్మదిగా దూరం చేస్తూనే వచ్చాడు. ఎంతలా అంటే, నేడు మనిషికి ఆ ఏకైక దేవుడెవరో తెలియని స్థితికి వాడు తీసుకురాగలిగాడు. ఆ ఏకైక దేవుడెవరో అన్వేషించి తెలుసుకోవలసిన పరిస్థితి మనిషికి ఏర్పడింది. చాలామందికైతే తాము దేవుళ్ళుగా భావించేదే నిజం అనే మాయలోనే ఉండిపోయారు. కాని, ఇదే మాయలో మనిషి ఉండిపోతే, చనిపోయాక నిజాన్ని తెలుసుకొని ఏం ప్రయోజనం ఉండదు. అందుకే, ఇంకా ఆయుష్యు ఉండగానే, ఆ ఏకైక నిజ దేవుడు ఎవరనే విషయాన్నీ మీకు తెలియజేయుటే మా ఈ ప్రయత్నం. ఇందులో చెప్పబడే విషయాలు మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి తప్పక అవసరం కనుక, వీటిని ఖచిత్తంగా షేర్ చేసి, వారికి మేలు చేయండి. ధన్యవాదాలు!