Gita Acharan

68. ఉదాహరణ ద్వారా నేతృత్వం


Listen Later

ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి చిన్నపిల్లలు ఎల్లప్పుడూ వారి తల్లిదండ్రుల యొక్క మార్గదర్శకత్వం కోసం చూస్తారు; కొత్త విషయాలు, మర్యాదలు, ప్రవర్తనలు మొదలైన వాటిని నేర్చుకుంటారు. మన మాటలకు, చేతలకు మధ్య సామరస్యముతో వారికి ఉదాహరణగా నిలుస్తూ ఉండడమే పిల్లల్ని పెంచడానికి ఉత్తమ మార్గము. తరువాత స్నేహితులు, ఉపాధ్యాయులు, సలహాదారులు మొదలైన వారిపై ఆధారపడటం కొనసాగుతుంది. అదే విధంగా మన పై ఆధారపడే వ్యక్తులు, మార్గదర్శకత్వం కోసం మన వైపు చూసే వ్యక్తులు ఉంటారని ఇది సూచిస్తుంది. మనం ఏం చేసినా అది వారి పై ప్రభావం చూపుతుంది. ఈ సందర్భంలో శ్రీకృష్ణుడు ఇలా చెప్పారు “శ్రేష్ఠుడైన పురుషుని ఆచరణమునే (ప్రవర్తననే ఇతరులును అనుసరింతురు. అతడు నిల్పిన (ప్రతిష్ఠించిన) ప్రమాణములనే లోకులందరును పాటించెదరు” (3.21).

శ్రీకృష్ణుడు ఇంకా వివరిస్తారు, “ఓ అర్జునా! ఈ ముల్లోకముల యందును నాకు కర్తవ్యము అనునదియే లేదు. అట్లే పొందదగిన వస్తువులలో ఏదియును నేను పొందనిదియును లేదు. ఐనను నేను కర్మలయందే ప్రవర్తిల్లుచున్నాను (3.22). ఓ పార్థా! ఎప్పుడైనను నేను సావధానుడనై కర్మలయందు ప్రవర్తింపకున్నచో లోకమునకు గొప్పహాని సంభవించును. ఎందుకనగా, మనుష్యులందఱును

అన్ని విధముల నా మార్గమునే అనుసరింతురు (3.23). నేను కర్మలను ఆచరించుట మానినచో ఈ లోకములన్నియును నశించును. అంతేగాదు, లోకములందు అల్లకల్లోలములు చెలరేగును. ప్రజానష్టము వాటిల్లును. అప్పుడు అందులకు నేనే కారకుడనయ్యెదను” (3.24).

శ్రీకృష్ణుడు పరమాత్మ స్థాయి నుంచి ఈ విషయాలను మనకు తెలియపరుస్తున్నారు. ఆయన సృష్టి, నిర్వహణ, విధ్వంసంతో కూడిన సృజనాత్మకత స్థాయి నుంచి బోధిస్తున్నారు. ఈ శ్లోకాలలో సృజనాత్మకత తన చర్యను ఆపివేస్తే వచ్చే పరిణామాల గురించి శ్రీకృష్ణుడు పేర్కొన్నారు.

ఒక రైతు విత్తనాలను విత్తినప్పుడు అవి మొలకెత్తడానికి కారణం సృజనాత్మకత. సృజనాత్మకత ఆగిపోతే, విత్తనాలు వృధా అవుతాయి. మొలకెత్తిన తర్వాత ఆ పంట ఎదగకపోతే, అది కూడా

గందరగోళానికి కారణం. పెరిగిన తర్వాత పంట పండకపోతే అది ముందు తరాలను నాశనం చేస్తుంది. ఈ ఉదాహరణ ద్వారా శ్రీకృష్ణుడి సంబోధనాన్ని అర్ధం చేసుకోవడం సులభం అవుతుంది.

      ఈ విశ్వంలో నిర్మించబడిన కనిపించే మరియు కనిపించని స్వయంచాలకత్వంపై మన జీవితాలు ఎంతో ఆధారపడి ఉన్నాయి. సృజనాత్మకత ద్వారా అలసిపోకుండా నిరంతరం నిర్వహించబడే అనేక కార్యాల కారణంగానే ఇది సాధ్యమవుతుంది.

...more
View all episodesView all episodes
Download on the App Store

Gita AcharanBy Siva Prasad


More shows like Gita Acharan

View all
The Stories of Mahabharata by Sudipta Bhawmik

The Stories of Mahabharata

925 Listeners