Gita Acharan

78. కోరికలకున్న శక్తి


Listen Later

కోరికలతో నిండి ఉన్న తులసీదాస్ కు తన నూతన భార్యను కలవాలనే బలమైన కోరిక కలిగింది. అతను ఒక శవాన్ని చెక్కదుంగగా భావించి రాత్రి నదిని దాటాడు; గోడపైకి ఎక్కడానికి పామును తాడుగా ఉపయోగించి భార్యను కలిశాడు. రక్తమాంసాలతో నిండిన నా శరీరంపై మీకున్న ప్రేమ, ఒకవేళ

రామనామం పై ఉన్నట్లయితే జీవితమనే నదిని ఎప్పుడో దాటి ఉండేవారని ఆయన భార్య అన్నది. అతను ఆ క్షణంలోనే పరివర్తన చెంది పరమ పూజ్యమైన 'రామ్ చరిత్ మానస్' కు రచయితగా మారాడు.

 ఇంద్రియాలను నియంత్రించడం ద్వారా కోరికలను నాశనం చేయాలనే కృష్ణుడి సలహా (3.41) ని బాగా అర్థం చేసుకోవడానికి తులసీదాసు కథ మనకు సహాయం చేస్తుంది.

 కోరికకు రెండు కోణాలు ఉంటాయి. మొదటిది మనలో ఉత్పన్నమయ్యే అభిరుచి, సంకల్పం, ధైర్యం అనే శక్తి , రెండవది దాని దిశ. ఆ శక్తి బాహ్యంగా నిర్దేశించబడి ఇంద్రియ సుఖాలు, ఆస్తులను కోరుకున్నప్పుడు వాటిని పొందే ప్రయత్నంలో అది వ్యమవుతుంది. కోరికలను నాశనం చేయమని శ్రీకృష్ణుడు మనకు చెప్పినప్పుడు, ఈ శక్తిని మనం నాశనం చేయకూడదని; తులసీదాస్ లాగా మనం అంతరాత్మను చేరుకునేందుకు అంతర్గత యాత్ర కొరకు ఉపయోగించాలని అర్థం. కక్ష్యను చేరుకోవడానికి ప్రారంభంలో రాకెట్ల నుండి శక్తి అవసరమైన ఉపగ్రహం వలే, సాహసోపేతమైన ఆధ్యాత్మిక ప్రయాణానికి ఈ శక్తి చాలా అవసరం. ఒకరు శాశ్వత స్థితికి చేరుకున్న తర్వాత శక్తి, దిశ రెండూ అర్థరహితమవుతాయి.

      మన శక్తులు మనకి అంతర్గత యాత్రలో సహాయపడాలంటే, మొదట మన ఇంద్రియాలను క్రమశిక్షణలో పెట్టాలని శ్రీకృష్ణుడు చెబుతున్నారు. ఆయన మనకు సహాయం చేయడానికి ఒక సోపానక్రమాన్ని వివరించారు. విడిభాగాల కంటే మొత్తం గొప్పది కాబట్టి, అన్ని ఇంద్రియాల మొత్తం అయిన మనస్సు ఇంద్రియాల కంటే గొప్పది. మనస్సు పలాయనానికి లేదా పోరాటానికి పరిమితం అవుతుంది కాబట్టి ఇది జంతువుల మనుగడ వరకు సరిపోతుంది. అయితే గొప్పదైన బుద్ధి, జంతువుల నుండి మనలను వేరు చేస్తుంది. అందుకే మనస్సు కంటే ఇది శ్రేష్టమైనది (3.42).

      బుద్ది కంటే ఆత్మ ఉత్తమమైనది కాబట్టి మనస్సు లేదా బుద్ధితో జయించడం కష్టతరమైన 'కోరిక' అనే శత్రువును నాశనం చేయడానికి ఆత్మను ఉపయోగించమని శ్రీకృష్ణుడు సలహా ఇస్తున్నారు (3.43).

...more
View all episodesView all episodes
Download on the App Store

Gita AcharanBy Siva Prasad


More shows like Gita Acharan

View all
The Stories of Mahabharata by Sudipta Bhawmik

The Stories of Mahabharata

925 Listeners