Vennela - వెన్నెల

ఆరేసినచీర_అమరావతికథలు


Listen Later


సత్యం శంకరమంచిగారి 'అమరావతి కథలు'నుండీ, "ఆరేసినచీర."

ఇది పుస్తకరూపంలో వెలువడిన సంపుటిలోని ఏడవ కథ.

కొత్తగా పెళ్ళయిన జంట, సాంబడు, లచ్చి. ఇష్టపడి చేసుకున్న పెళ్ళి కాదు. సాంబడికి సీతాలు మీద, లచ్చికి కోటేశు మీదా ఆశ. వాళ్ళిద్దరూ వీళ్ళకంటే అందమైన వాళ్ళు కాదేమో కాని, కాస్త ముస్తాబయి కంటికి నదరుగా ఉండేవాళ్ళమీద యౌవనంలో కలిగే వ్యామోహం! 

నెమిలికంఠం రంగు చీర కట్టుకుని లచ్చి కంటపడగానే, సాంబడు అప్పటిదాకా తిట్టుకున్న పెళ్ళాంలో రతీ దేవినే చూసాడు. కోటేశు అత్తకోడలంచు పంచె చుట్టుకున్నదాలస్యం, లచ్చికి మొగుడంటే మోజు కలిగింది. తిట్లు పోట్లాటలూ వెనక్కి పోయాయి. మంచి బట్టలు, ముస్తాబులు లేవనే విసుగుల మాటున నక్కి, అప్పుడే బయటపడ్డ అనురాగం ముందు ఏ సీతాలూ, కోటేశూ గుర్తు రాలేదు. అదే ఇద్దరినీ ఆ క్షణంలో కట్టిపడేసింది. 


రెండు మూడు పుటలు మించకుండా పాఠకులకు ఒక గొప్ప రసానుభూతి కలిగించగల కథలివన్నీ. తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తి, మక్కువ ఉన్నవారందరూ కొని చదివి దాచుకుని, మళ్ళీ మళ్ళీ చదువుకోవలసిన/చదువుకునే అపురూప కథా మాణిక్యాలలో ఒకటి భాషా ప్రియులు, సాహితీమిత్రులకు పరిచయం, బహుశా పునః పరిచయం అనటమే సబబేమో; చేయాలన్న చిన్న ప్రయత్నం, నానుండీ.

దయతో విన్న మీకు నా కృతజ్ఞతలు. నా ఈ ప్రయత్నం మీకు ఏమేరకు ఆనందాన్ని కలిగించినా, నేను కృతకృత్యుడనైనట్లే. ఇది ఏమాత్రం పేలవంగా తోచినా, అది నా ప్రయత్న లోపమే.

ధన్యవాదాలు,

కొండుభొట్ల. చంద్రశేఖర్

Twitter ID: @Chandu1302

...more
View all episodesView all episodes
Download on the App Store

Vennela - వెన్నెలBy చంద్రశేఖర్ కొండుభొట్ల