Sign up to save your podcasts
Or

సత్యం శంకరమంచిగారి 'అమరావతి కథలు'నుండీ, "అద్గద్గో బస్సు"
ఇది పుస్తకరూపంలో వెలువడిన సంపుటిలోని పదమూడవ కథ.
ఊరంతా సంతోషం. అంతానా? అంటే, ఒక్క జట్కా సాయిబుకి మాత్రం నచ్చలేదెందుకో! ఈర్ష్య! కుళ్ళు. ఇక తన బేరాలు పోతాయనీ... అవునా??
అభివృద్ధి, పురోగమనం... వీటినెవరూ ఆపలేరు. కానీ, ప్రతి కొత్తదనం వెనుకా ఒక కన్నీటి చుక్క. ప్రతి మార్పూ, ఒక వర్గాన్ని మరింత కిందికి తొక్కేస్తుంది. ఉన్న అరకొర జీవనాధారాన్ని కూడా కాలదంతుంది. మార్పు మంచిదే. నిజమే కానీ, మరి ఆ కూలిపోయే జీవితాలో? ఆ బడుగు జీవాలో??
రెండు మూడు పుటలు మించకుండా పాఠకులకు ఒక గొప్ప రసానుభూతి కలిగించగల కథలివన్నీ. తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తి, మక్కువ ఉన్నవారందరూ కొని చదివి దాచుకుని, మళ్ళీ మళ్ళీ చదువుకోవలసిన/చదువుకునే అపురూప కథా మాణిక్యాలలో ఒకటి భాషా ప్రియులు, సాహితీమిత్రులకు పరిచయం, బహుశా పునః పరిచయం అనటమే సబబేమో; చేయాలన్న చిన్న ప్రయత్నం, నానుండీ.
దయతో విన్న మీకు నా కృతజ్ఞతలు. నా ఈ ప్రయత్నం మీకు ఏమేరకు ఆనందాన్ని కలిగించినా, నేను కృతకృత్యుడనైనట్లే. ఇది ఏమాత్రం పేలవంగా తోచినా, అది నా ప్రయత్న లోపమే.
ధన్యవాదాలు,
Twitter ID: @Chandu1302
By చంద్రశేఖర్ కొండుభొట్లసత్యం శంకరమంచిగారి 'అమరావతి కథలు'నుండీ, "అద్గద్గో బస్సు"