Telugu Sahityam Teasers

Alpajeevi – Chapter 1


Listen Later

#అల్పజీవి

అసమర్ధుడి జీవయాత్ర, చివరకు మిగిలేది, అల్పజీవి - ఇవి తెలుగులో మనోవైజ్ఞానిక రచనలుగా పేరుగడించాయి.


అంపశయ్య నవీన్ గారు ఈ రచనలని ఇలా నిర్వచించారు. “ఇలాంటి రచనల ముఖ్య లక్షణం పాత్రల బాహ్య రూపాన్ని కాకుండా మనసుల్ని శోధించటం. ప్రధానంగా పాత్రల మనస్సుల్లో చెలరేగుతున్న సంఘర్షణను చిత్రించటం.”

ప్రేమ కథా చిత్రాల్లోని సన్నివేశాలు మన జీవితంలో జరిగినవే అయితే మన ఆసక్తి పెరిగి ఆ సన్నివేశాలని ఇంకా ఆస్వాదిస్తాము. అదే విధంగా ఈ రచనల్లో ఇతివృత్తం, కథానాయకుల వ్యక్తిత్వం ఎవరి జీవితానికైనా దగ్గరగా ఉంటే, వారికి తాము జీవితంలో ఏకాకులం కాదనే ఉపశాంతిని పొందవచ్చు. ఇప్పటికే బుచ్చిబాబు ‘చివరకు మిగిలేది’, గోపీచంద్ ‘అసమర్ధుని జీవయాత్ర’ పుస్తకాల శ్రవణ రూపాలను అందించిన దాసుభాషితం, రావిశాస్త్రి గా పేరుగడించిన, రాచకొండ విశ్వనాథ శాస్త్రి రచన ‘అల్పజీవి’ ని, వారి కుమారుడు రాచకొండ ఉమాశంకర శాస్త్రి గారి సౌజన్యంతో మీకు ఈ వారం అందిస్తోంది. ఈ శ్రవణ పుస్తక విడుదలతో, తెలుగు మనోవైజ్ఞానిక రచనా త్రయాన్ని మీకు అందిస్తున్నందుకు మేము ఆనందిస్తున్నాము

#అల్పజీవి శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఈ వీడియోలో వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.


https://www.dasubhashitam.com/ab-title/ab-alpajeevi

Listen to a part of Chapter 1 of #Alpajeevi. Download the App via the link above to listen to the full title.

––

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.

–––

ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.
అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

...more
View all episodesView all episodes
Download on the App Store

Telugu Sahityam TeasersBy Dasubhashitam