Mic Drop

Amerikalalu | అమెరికలలు


Listen Later



అమెరికలలు



అమెరికా రావాలంటే నాకు భయం

నా కలగాపులగపు ఆలోచనాలోచనాల ఆవేదనా బాష్పాలు

ఈ అస్త్రసన్యాసి అంబులపొదిలో అసమర్థత అనిశ్చయం అమ్ములు

అసలేం కావాలో తెలియని అయోమయమో

అన్నీ కావాలనే అత్యాశో

అంతా అగమ్యగోచరం


పాశం దేశం ప్రవ్రుత్తి ఒకవైపు

ప్రగతి శాంతి వృత్తి ఒకవైపు

గుండె కొండ చుట్టూ

స్వప్న సాగర మథనం


జడత్వ కాలకూటమా

కలల అమృతభాండమా

ఫలితం తెలియని కటొర పరీక్ష


' కాల' సర్ప పడగల మీద

కదలని కాళ్ళ నర్తన కేళి

కరాళ దంష్ట్రల మధ్య

చిక్కకుండా ఉండే దారేది





...more
View all episodesView all episodes
Download on the App Store

Mic DropBy Vasu Mullapudi