Vennela - వెన్నెల

అన్నపూర్ణకావిడి_అమరావతికథలు


Listen Later

సత్యం శంకరమంచిగారి 'అమరావతి కథలు'నుండీ, "అన్నపూర్ణ కావిడి."

ఇది పుస్తకరూపంలో వెలువడిన సంపుటిలోని పదహారవ కథ. 

తల్లిదండ్రులు చెప్పిన శాంతమ్మను కాదని కాంతమ్మను పెళ్ళిచేసుకున్న శరభయ్యకి సంసార సుఖం దక్కలేదు సరికదా, మనశ్శాంతి కూడా కరువు చేసింది, కాంతమ్మ. దాంతో ఇల్లువిడిచి బైరాగుల్లో కలిసిపోయేడు. కానీ భార్య మీది కోరిక చావక, ఎవరో దానమిచ్చిన అన్నపూర్ణ కావిడి మోసుకుంటూ ఊరు చేరాడు. అప్పటికే కాంతమ్మ పోయినందువల్ల, భిక్షమెత్తుతూ బతికాడు. 

ఆఖరి రోజుల్లో, తన తోటివాడైన సిద్ధయ్య ఆ కావిడి తనకిమ్మని అడిగితే, తను ఎరిగిన జీవిత సత్యం చెప్పుకుంటాడు. అన్నం పెట్టే ఆలిని కోరుకోవాలి కానీ, అడుక్కు తినే పళ్ళెం ఎందుకూ, అని. 

కొంచం తరచి చూసుకుంటే ఎంతో చెప్పగల కథ ఇది. భార్య భర్తల బంధంలో సుఖజీవనానికి కావలసింది సానుకూలమైన వాతావరణం, సర్దుకుపోయే మనస్తత్వం కాని, కేవలం భౌతిక సౌందర్యమో, సిరులో కాదు. ఆకలి కడుపు కోరేది, కాస్త ఆదరణ, అభిమానం. బాంధవ్యాలను నిలబెట్టేది పరస్పర ఆపేక్షలు, ఇచ్చిపుచ్చుకునే గౌరవం.

అవగాహన కొరవడిననాడు, కలిసిఉన్నామనుకునే కుటుంబాలన్నీ కూడా, అన్నపూర్ణ కావిళ్ళే! 


రెండు మూడు పుటలు మించకుండా పాఠకులకు ఒక గొప్ప రసానుభూతి కలిగించగల కథలివన్నీ. తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తి, మక్కువ ఉన్నవారందరూ కొని చదివి దాచుకుని, మళ్ళీ మళ్ళీ చదువుకోవలసిన/చదువుకునే అపురూప కథా మాణిక్యాలలో ఒకటి భాషా ప్రియులు, సాహితీమిత్రులకు పరిచయం, బహుశా పునః పరిచయం అనటమే సబబేమో; చేయాలన్న చిన్న ప్రయత్నం, నానుండీ.

దయతో విన్న మీకు నా కృతజ్ఞతలు. నా ఈ ప్రయత్నం మీకు ఏమేరకు ఆనందాన్ని కలిగించినా, నేను కృతకృత్యుడనైనట్లే. ఇది ఏమాత్రం పేలవంగా తోచినా, అది నా ప్రయత్న లోపమే.


ధన్యవాదాలు,

కొండుభొట్ల. చంద్రశేఖర్

Twitter ID: @Chandu1302

...more
View all episodesView all episodes
Download on the App Store

Vennela - వెన్నెలBy చంద్రశేఖర్ కొండుభొట్ల