Telugu Sahityam Teasers

Anubhavalu - Jnapakaloonu – Chapter 1


Listen Later

#అనుభవాలు జ్ఞాపకాలూను

తెలుగు కథా రచయితల్లో మున్ముందుగా జ్ఞప్తికి వచ్చే కొందరిలో శ్రీపాద సుబ్రహణ్య శాస్త్రి గారు ఒకరు. ఇంకా చెప్పాలంటే వీరే ప్రధములు. వెలనాటి శాఖీయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వీరు వారి వంశ విద్యలైన శ్రౌతస్మార్తములు, జ్యోతిష్యములు నేర్చుకున్నారు. వచనానికి కండబలం, గుండెబలం ఇచ్చిన రచయితల్లో శాస్త్రి గారు గణనీయులు. వాడీ, వేడి సమృద్ధిగా ఉన్న భాష వీరిది.సంస్కృత పండితుడు అయికూడా తెలుగుభాష మీద మక్కువతో తెలుగులోనే ఎక్కువ రచనలు చేశారు. ఎందరో రచయితలు అన్నట్లు వీరి రచనలన్నీ ఒక ఎత్తు ఈ "అనుభవాలు జ్ఞాపకాలు" ఒక ఎత్తు. స్వీయ చరిత్ర, ఆత్మకథ వంటి పేర్లు కాకుండా అనుభవాలు జ్ఞాపకాలు అనే ఈ పేరు ఎందుకు పెట్టారు? వీరి జీవితంలో జరిగిన సంఘటనలు, ఆనాటి వారి జీవన విధానం ఏమిటో వినండి మీ దాసుభాషితంలో.

#అనుభవాలు జ్ఞాపకాలూను శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

https://www.dasubhashitam.com/ab-title/ab-anubhavalu-jnapakaloonu-1


Listen to a part of Chapter 1 of #AnubhavaluJnapakaloonu. Download the App via the link above to listen to the full title.

––

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.


–––

ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.

అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.

ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

...more
View all episodesView all episodes
Download on the App Store

Telugu Sahityam TeasersBy Dasubhashitam