Sign up to save your podcasts
Or

సత్యం శంకరమంచిగారి 'అమరావతి కథలు'నుండీ, "ధావళీ చిరిగిపొయింది."
కొడుకు పేరిశాస్త్రి మటుకు సర్వావలక్షణ సుశోభితుడు. వారకాంతల వంటిబిగువులకోసం వెంపర్లాట, వారి కౌగిళ్ళకోసం రోజూ పరుగులాటలే జీవితం. కొడుకుగురించిన చింతతోటే మహదేవయ్యగారు వెళ్ళిపోయారు. ఆ రాత్రి యథాప్రకారం తిరిగి తిరిగి వచ్చిన పేరిశాస్త్రిని కౌగిలించుకుని ఏడ్చిన తల్లి సోమిదేవమ్మగారితో కలిసి తానూ గొల్లుమన్నాడు! ఆ క్షణంలో అతనిలోని జారత్వం, స్త్రీలాలసత్వం సమసిపోయాయి!
ఆడస్పర్శే అయినా అమ్మ స్పర్శ అతనిలోని మనిషిని తట్టిలేపింది. శిధిలమైన సంస్కారం తిరిగి లేచింది.
రెండు మూడు పుటలు మించకుండా పాఠకులకు ఒక గొప్ప రసానుభూతి కలిగించగల కథలివన్నీ.
తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తి, మక్కువ ఉన్నవారందరూ కొని చదివి దాచుకుని, మళ్ళీ మళ్ళీ చదువుకోవలసిన/చదువుకునే అపురూప కథా మాణిక్యాలలో ఒకటి భాషా ప్రియులు, సాహితీమిత్రులకు పరిచయం, బహుశా పునః పరిచయం అనటమే సబబేమో; చేయాలన్న చిన్న ప్రయత్నం, నానుండీ.
దయతో విన్న మీకు నా కృతజ్ఞతలు. నా ఈ ప్రయత్నం మీకు ఏమేరకు ఆనందాన్ని కలిగించినా, నేను కృతకృత్యుడనైనట్లే. ఇది ఏమాత్రం పేలవంగా తోచినా, అది నా ప్రయత్న లోపమే.
ధన్యవాదాలు,
కొండుభొట్ల. చంద్రశేఖర్
Twitter ID: @Chandu1302
By చంద్రశేఖర్ కొండుభొట్లసత్యం శంకరమంచిగారి 'అమరావతి కథలు'నుండీ, "ధావళీ చిరిగిపొయింది."