దీపారాధన చేసేందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఎలాగంటే అలా చేయకూడదు. దీపారాధన చేసేముందు వత్తి వేసి తర్వాత నూనె పోస్తుంటారు.కార్తీక మాసం పర్వదినాలలో దీపారాధన చేసే భక్తులు అవకాశం ఉంటే రాగి ప్రమిదలో నిర్వహిస్తే చాలా మంచిది. సర్వ రోగాలు, దోషాలు పరిపూర్ణంగా నశిస్తాయి. కుందుని ఒక పళ్శెంలో కానీ తమలపాకు మీద కానీ పెట్టాలి. కింద ఆధారం లేకుండా పెట్టకూడదు.