రంజాన్ ముస్లింలకు ఎంతో విశేషమైన పండుగ. ఇది మానవత్వానికీ, దానధర్మాలకు, పవిత్రతకు ప్రతీక. ఈ పండుగ మానవాళికి గొప్ప సందేశాన్ని ఇస్తుంది. ఈ రోజున చిన్నాపెద్దా, ధనికాపేద భేదాలు లేకుండా సహృదయంతో 'ఈద్ ముబారక్' అని శుభాకాంక్షలు తెలుపుకుని ఆలింగనం చేసుకుంటారు. మానవుల మధ్య నెలకొన్న వర్గ వైషమ్యాలు తొలగించి, అందరిలో ఆధ్యాత్మిక చింతన కలిగించి, చిరుజీవితాన్ని ఆనందంతో నింపి పుణ్యకార్యాల వైపు దృష్టి మరల్చే రంజాన్ మాసం చైతన్యాన్ని కలిగించి ముందుకు సాగే ధైర్యాన్నిస్తుంది.