
Sign up to save your podcasts
Or
జనియించినాడు ప్రభువు యేసు
శుభములను కురిపింపను
జగతిలో నేడు అరుదెంచెను
అభయమును మనకొసగన్
1 . పరమును వీడి ధరణికి వచ్చెన్
పాపము నుండి విడుదల నిచ్చెన్ || 2 ||
ఇమ్మానుయేలు యను నామమందు
ఇమ్ముగ మీతో సదా నుండును
2. దైవసుతుండు నరరూపి ఆయే
పశులశాలలో పవళించినాడు || 2 ||
దీనులనెల్ల దీవింపనెంచి
దీనుడై తానే దిగి వచ్చెను
3 .ఆశ్చర్యకరుడు అలోచనకర్త.
బలవంతుడైన ప్రభు యేసురాజు || 2 ||
సమధానకర్త నిత్యుడగు తండ్రి
సమాధానం మీపై క్రుమ్మరించెను
4. పాపకూపములో పడియున్న నీవు పరుగిడిరమ్ము ప్రభు కడకు
అర్పించునంత నీ హృదయంబు
నిశ్చయముగా రక్షించునేసుడే
జనియించినాడు ప్రభువు యేసు
శుభములను కురిపింపను
జగతిలో నేడు అరుదెంచెను
అభయమును మనకొసగన్
1 . పరమును వీడి ధరణికి వచ్చెన్
పాపము నుండి విడుదల నిచ్చెన్ || 2 ||
ఇమ్మానుయేలు యను నామమందు
ఇమ్ముగ మీతో సదా నుండును
2. దైవసుతుండు నరరూపి ఆయే
పశులశాలలో పవళించినాడు || 2 ||
దీనులనెల్ల దీవింపనెంచి
దీనుడై తానే దిగి వచ్చెను
3 .ఆశ్చర్యకరుడు అలోచనకర్త.
బలవంతుడైన ప్రభు యేసురాజు || 2 ||
సమధానకర్త నిత్యుడగు తండ్రి
సమాధానం మీపై క్రుమ్మరించెను
4. పాపకూపములో పడియున్న నీవు పరుగిడిరమ్ము ప్రభు కడకు
అర్పించునంత నీ హృదయంబు
నిశ్చయముగా రక్షించునేసుడే