Sign up to save your podcasts
Or

ఇది పుస్తకరూపంలో వెలువడిన సంపుటిలోని ఇరవైఒకటవ కథ.
నాలుగేళ్ళు నిండని చిట్టి, అన్న అక్క బడికిపోతుంటే తనూ వెళుతుంది వాళ్ళతో రోజూ. దాన్ని ఇంకా బళ్ళో వెయ్యలా. అయితేనేం? దానికీ ఒక బడిసంచీ, దాన్నిండా బోల్డంత సామాను. బడికి పొయ్యే దారిలో ఆటలూ, బడిదగ్గర, గుడిదగ్గర గంగన్న తాతతో ముచ్చట్లు... దానికీ అన్నీ కావల్సిందే!
బళ్ళో అందరూ పాఠాలు చదూకుంటుంటే, చిట్టి కూడా పలక మీద దానికి తోచిన గీతలు గీస్తుంది. బీళ్ళకి మేతకు పోయే ఆవులు బజారు మీదుగా పోతుంటే వాటిని చూస్తుంటుంది. మరి రోజూ చిట్టి ఆడుకునే లేగదూడో? అది కూడా రోజూ బడిముందు ఆగుతుంది చిట్టికోసం. లేగదూడని చూడగానే చిట్టీ పరిగెత్తుతుంది దాన్ని కలిసి కబుర్లు చెప్పుకొవటం కోసం! తను పలక మీద గీసిన పిచ్చి గీతలు చుపిస్తూ, అవే 'అ ఆ'లంటుది, అవే ఒంట్లంటూ లేగదూడకి చూపిస్తుంది. సాయంత్రం తొందరగా ఇంటికొచ్చేయమంటుంది. ఆ లేగదూడ చిట్టి ఒళ్ళూ మొహం నాకుతుంది, స్నేహంగా.
ఇది మరే చిట్టి కథో కాదు. అచ్చంగా మన బాల్యం. మీరూ, నేను, వాడూ, అదీ మనందరం చిన్నతనంలో ఎంత సంతోషంగా ఆడుతూ పాడుతూ ఎదిగామో... ఆ తీపిగురుతుల మిఠాయి పొట్లం! సత్యంగారు ప్రేమతో మనకందించారు, ఆ తీయదనం ఎప్పటికీ మనతో, మనలో ఉండిపోనిమ్మని.
ఆ చిట్టిపాపాయి కంటే, ఆ లేగదూడకంటే ఎంతో చదువుకుని ఏదేదో సాధించామనుకునే మనం, మరి ఆ పసితనం సంతోషాలు దాచుకున్నామా? ఆ ఆత్మీయతలను నిలుపుకున్నామా? ఆ స్నేహాలను మిగుల్చుకున్నామా? ఇప్పటి మనలో ఇంకా కూడా అప్పటి మనం నిలిచి ఉన్నామా? అలాగ ఉండగలగటమే మనమని ఒక్క ముగింపు వాక్యంతో హెచ్చరిస్తారు, సత్యంగారు. ఆ హెచ్చరిక కోసమైనా వారికి ప్రతిరోజూ శతకోటి నమస్కారాలు చేయాలి మనం!
రెండు మూడు పుటలు మించకుండా పాఠకులకు ఒక గొప్ప రసానుభూతి కలిగించగల కథలివన్నీ. తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తి, మక్కువ ఉన్నవారందరూ కొని చదివి దాచుకుని, మళ్ళీ మళ్ళీ చదువుకోవలసిన/చదువుకునే అపురూప కథా మాణిక్యాలలో ఒకటి భాషా ప్రియులు, సాహితీమిత్రులకు పరిచయం, బహుశా పునః పరిచయం అనటమే సబబేమో; చేయాలన్న చిన్న ప్రయత్నం, నానుండీ.
దయతో విన్న మీకు నా కృతజ్ఞతలు. నా ఈ ప్రయత్నం మీకు ఏమేరకు ఆనందాన్ని కలిగించినా, నేను కృతకృత్యుడనైనట్లే. ఇది ఏమాత్రం పేలవంగా తోచినా, అది నా ప్రయత్న లోపమే.
ధన్యవాదాలు,
కొండుభొట్ల. చంద్రశేఖర్
Twitter ID: @Chandu1302
By చంద్రశేఖర్ కొండుభొట్లఇది పుస్తకరూపంలో వెలువడిన సంపుటిలోని ఇరవైఒకటవ కథ.