Harshaneeyam

మా పల్లెటూరోళ్ల, గత కాలపు వినోదాలు!


Listen Later

నేను చాల రోజుల నుండి మన మధ్య నుండి మాయమై పోయిన ఒకప్పటి వినోదాల గురుంచి రాయాలనుకుంటున్న. కాక పోతే గత పల్లెవాసిగా నావన్నీ ఒకప్పటి గ్రామాల్లో కనిపించి ఇప్పుడు మాయమయ్యినవి అయ్యుంటాయి. మొదట మనందరికీ ఇష్టమైన ఆసక్తికర మైన రికార్డింగ్ డాన్స్ లతో మొదలెడుతా. మా వూరిలో శ్రీరామనవమి నాలుగు రోజులో ఐదు రోజులో జరిగేది. ఒక్కో రోజు ఒక్కొక్కరి ఉభయం. ఒక రోజు బలిజ వాళ్ళది , ఒక రోజు గొల్ల వాళ్ళది , ఒక రోజు సాలె వాళ్ళది , కళ్యాణం రెడ్లది ఇలా అన్న మాట. ఉభయం ఎవరిదైతే ఆ రోజు దేవుడి అలంకరణ , అన్న ప్రసాదాలు , వినోదాల ఏర్పాట్లు వాళ్లవే. మా వూరు అంటే ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళ వూరు. అమ్మమ్మ వూరు అంటే ఆత్మ బంధువుల వూరు అంటారుగా. ఈ ఉభయాల సందర్భం గా జరిగే వినోద సమర్పణలో మేము ఎదురు చూసేది రికార్డింగ్ డాన్స్, కీలు గుర్రాలు, నెమలి వేషాలు. ఆ రోజు ఉదయం నుండి సాయంత్రము ఎప్పుడవుతుందా అని ఎదురు చూడటం, ఈ లోపల డాన్స్ పాపలు వచ్చారా అని ఎంక్వయిరీ లు చేయటం, కుతూహలం చంపుకోలేక జట్లు జట్లు గ పిల్ల కాయలం వెళ్లి వాళ్ళు బస చేసిన ఇంటి చుట్టూ గిరికీలు కొట్టటం . ఈ లోపల ఎవడో పిల్లకాయ చెప్తాడు, నేను చుశానురా డాన్స్ పాపని కిటికీ తొర్రలోంచి అని. వాడు కన్ఫర్మ్ చేయగానే హమ్మయ్య అని తృప్తి పడటం.

చీకటి పడగానే మొదలయ్యేది వాళ్ళ ఊరేగింపు, బస దగ్గర నుండి గుడికి. కీలు గుర్రాలు , నెమలి వేషాల వాళ్ళు, రికార్డిండ్ డాన్స్ ట్రూప్ లు, దారి పొడవునా వాళ్ళతో పెట్రోమాక్ లైట్స్ వెలుగులో మేము. మొదట కీలు గుర్రాల ఆట, తర్వాత నెమలి వేషాలు, ఆ తర్వాత అసలు సిసలు రికార్డింగ్ డాన్స్ లు. ఈ రికార్డింగ్ డాన్స్ లకు నార్మల్ గా స్టేజి, ట్రాక్టర్ తొట్టి. మొదట డాన్స్ లన్నీ క్లాసికల్ పాటలకి. కుర్ర

...more
View all episodesView all episodes
Download on the App Store

HarshaneeyamBy Harshavardhan