Viswa Vikasam Podcasts

Meaning of Gayatri Mantra in Telugu - Viswa Vikasam


Listen Later

గాయత్రి మంత్రం
గాయత్రి మంత్రం... ఈ మంత్రం గురించి తెలియని హిందువులు ఉండరు. అత్యంత పవిత్రమైన మరియు శక్తివంతమైన మంత్రం ఇది. ఈ మంత్రం మరియు గాయత్రి మాత యొక్క విశిష్టతలను ఇప్పుడు తెలుసుకుందాం.

। గాయత్రి మంత్రం - శ్లోకం యెక్క అర్ధం ।
ముందుగా గాయత్రి మంత్రం యెక్క అర్ధాన్ని చూద్దాం. ఈ శ్లోకం లోని పదాలని, బీజాక్షరాలను విడివిడిగా గమనిస్తే
భూః: అనగా భూలోకం
భువః: అనగా అంతరిక్షలోకం
స్వః: అనగా స్వర్గ లోకం 
ధీమహీ: అనగా ధ్యానం. ఏమి ధ్యానం చేయాలి?
తత్: ఆ యెక్క 
వరేణ్యం భర్గః: శక్తిని ధ్యానం చేయాలి. ఎవరి శక్తి ఇది?
సవితుః దేవశ్య వరేణ్యం భర్గః: మనకు జన్మనిచ్చిన ఆ యెక్క శక్తిని ధ్యానం చేయాలి. ఎందుకు ధ్యానం చేయాలి?
యః ప్రచోదయాత్:  ముందుకు నడిపించడానికి. దేన్ని ముందుకు నడిపించడానికి?
నః ధియః:  మన మనసును ముందుకు నడిపించడానికి. ఎక్కడికి ముందుకు నడిపించడానికి? మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా భూమి నుండి స్వర్గలోకానికి అంటే ముక్తి మార్గానికి.

। గాయత్రి మంత్రం యెక్క విశిష్ఠత ।
ఈ శ్లోకాన్ని మెదటగా బ్రహ్మర్షి విశ్వామిత్రులవారు ఋగ్వేదములో లిఖించారు. త్రికాల సంధ్యల్లో ధ్యానం చేయాలి అని చెప్తారు. అంటే… సూర్యోదయానికి ముందు, మధ్యాహ్నం మరియు సూర్యాస్తమయంలో ఈ శ్లోకాన్ని ధ్యానం చేయాలి.

।గాయత్రి మాత - సర్వదేవ స్వరూపిణి।
గాయత్రి మాతను సర్వదేవ స్వరూపిణిగా వర్ణిస్తారు.
1. పంచముఖాలు - గాయత్రి దేవి యెక్క ఐదు ముఖాలు పంచభూతాలైన భూమి, నీరు, గాలి, అగ్ని మరియు అకాశాన్ని శూచిస్తాయి
2. వరద - ఙ్నానాన్ని ప్రసాదిస్తుంది
3. అభయ - భయాన్ని పోగొడుతుంది
4. అంకుశ - మనసుపై నియంత్రణను సూచిస్తుంది
5. కష - కోరికలపై నియంత్రణను సూచిస్తుంది
6. శుభ్రం కపాలం - స్పష్టమైన మనసును సూచిస్తుంది
7. గధ - శత్రువినాశనం
8. శఖం - ఓంకార శబ్దానికి మూలం
9.చక్రం - మనసుకు చిహ్నం
10. అరవిందయుగళం - సమృద్ధిని సూచిస్తుంది

అంతేకాకుండా గాయత్రి దేవిని వేదమాత అని కూడా పిలుస్తారు. 
1. నెలవంక, త్రినేత్రం, శుభ్రకపాలం: ఇవి మహాశివుని సూచిస్తాయి.
2. శఖచక్రాలు, గధ మరియు అభయ ముద్రలు: విష్ణువుని సూచిస్తాయి
3. పద్మము: భ్రహ్మని సూచిస్తుంది
4. వరద ముద్ర మరియు రెండు పద్మములు: లక్ష్మీదేవిని సూచిస్తాయి.

గాయత్రి మంత్రములో ఇరవైనాలుగు బీజాక్షరాలను మూడు వరుసలలో లిఖించబడింది. అంతేకాకుండా గాయత్రి దేవికి ఇరవైనాలుగు వర్ణాలు, ఇరవైనాలుగు శక్తిరూపాలు కూడా ఉన్నట్టుగా దేవీభాగవతములో విష్ణుమూర్తి నారదునికి విర్ణించినట్టుగా వివరిచబడింది.
వాల్మీకి రామాయణం మెత్తము 24,000 శ్లోకాలు ఉంటాయి. ప్రతి 1000వ శ్లోకములోని మెదటి అక్షరామును కలిపిచదివితే గాయత్రి మంత్రం వస్తుందట.

Support the show (https://www.buymeacoffee.com/viswavikasam)
...more
View all episodesView all episodes
Download on the App Store

Viswa Vikasam PodcastsBy Satya