Sign up to save your podcasts
Or

ఇది పుస్తకరూపంలో వెలువడిన సంపుటిలోని ఆరవ కథ.
ముక్కోటి ఏకాదశి నాడు అమరేశ్వరుడి దర్శనం కోసం ఆశపడ్డ ముసలమ్మ. చింపిరి జుట్టు, పాత చీర... ఎంత ఆర్తితో, భక్తితో ఆత్మ శుద్ధంగా ఉన్నా, భౌతిక ప్రపంచంలో కనపడాల్సిన హంగులు రంగులు లేనిదే భక్తుడెలా? అందుకే అందరూ తోసేసారు. ఛీ అన్నారు. అందరూ అంటే మరి అందరూనూ. ఆఖరికి సభ్య సమాజంలోని అట్టడుగు వర్గంలో పొగిలే అడుక్కుతినేవాళ్ళు సైతం!
శుచిగా తలారా స్నానం, శుభ్రమైన బట్టలు కూడా లేని ముసలిదానికి దేవుడి ఆశీర్వాదం ఎలాగని సమాజంలో పైవర్గాల కినుక. ఉన్నాళ్ళుండగా, వాళ్ళ ముష్టి వ్యాపారానికి ఈ ముసల్ది అనవసరమైన పోటీ కదా, అని బిచ్చగాళ్ళ ఏడుపు.
ఎందుకు ఈ యాతన అనుకుందేమో, ఆ ముసలి ప్రాణం గుడిలోపల కాలు పెట్టకుండానే, అమరేశ్వర దర్శనం చేసుకోకుండానే, శివైక్యం పొందింది. ముక్కోటినాడు శవమైంది. పోతూ పోతూ ముష్టివాడు మరో రూపాయి దండుకోవటానికి ముడిసరుకైంది.
రెండు మూడు పుటలు మించకుండా పాఠకులకు ఒక గొప్ప రసానుభూతి కలిగించగల కథలివన్నీ. తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తి, మక్కువ ఉన్నవారందరూ కొని చదివి దాచుకుని, మళ్ళీ మళ్ళీ చదువుకోవలసిన/చదువుకునే అపురూప కథా మాణిక్యాలలో ఒకటి భాషా ప్రియులు, సాహితీమిత్రులకు పరిచయం, బహుశా పునః పరిచయం అనటమే సబబేమో; చేయాలన్న చిన్న ప్రయత్నం, నానుండీ.
దయతో విన్న మీకు నా కృతజ్ఞతలు. నా ఈ ప్రయత్నం మీకు ఏమేరకు ఆనందాన్ని కలిగించినా, నేను కృతకృత్యుడనైనట్లే. ఇది ఏమాత్రం పేలవంగా తోచినా, అది నా ప్రయత్న లోపమే.
ధన్యవాదాలు,
కొండుభొట్ల. చంద్రశేఖర్
Twitter ID: @Chandu1302
By చంద్రశేఖర్ కొండుభొట్లఇది పుస్తకరూపంలో వెలువడిన సంపుటిలోని ఆరవ కథ.