Harshaneeyam

నేను పగలకొట్టిన పిచ్చుకను నాకు ఇవ్వండి తెచ్చి!


Listen Later

నాకు నా చిన్నప్పటి రోజులు ఇప్పటికీ జ్ఞాపకమే. నాలుగేళ్లు వుంటాయనుకుంటా నాకు అప్పుడు. మా పెద్దమ్మతో నెల్లూరు వెళ్ళినప్పుడు, సతాయించి సతాయించి ఒక కారు బొమ్మ కొనిపిచ్చుకున్నా. కాస్త అదిమి పెట్టి వెనక్కి లాగితే స్ప్రింగ్ ముడుచుకొని, వదలగానే రయ్యిమంటూ ముందు కెళ్లే ఎర్ర కారు అది. కొన్ని రోజులైతే దానితోనే నా లోకం. ఉన్నట్టుండి ఒకసారి దాని ముందు చక్రం ఊడి పోయింది. సరి చేసి పెడితే కొంచెం దూరం వరకు చక్రం ఉండటం, తర్వాత ఊడి, కుంటి గుర్రం లాగా ఒక పక్కకి పడి పోవటం. అలా చక్రం ఊడిన కారు నాకు నచ్చలా. ఒక రాయి తీసుకున్నా, మా దేవళం పంచలో కూర్చున్నా, కారుని పచ్చడి పచ్చడి చేసిపారేశా!. మా మూగ పూజారి నేను చేసే పని చూసి, లబ లబ లాడాడు. ఎత్తుకెళ్ళి దాన్ని మా సుబ్బరామ్ తాత వాళ్ళ స్నానాల నీళ్లు వెళ్లే తూము కింద పారేసా!. అలా మా వాళ్లంతా నీ కారేదిరా అని అనటం, నేను పోయుందని చెప్పటం. మా వాళ్ళు నిజమే కాబోలు వీడికి ఊరంతా పెత్తనాలే కదా, ఎక్కడో పారేసుకుని ఉంటాడని సరిపెట్టుకున్నారు. మా శీనన్న కొన్నాళ్ళకు గండవరం తిరునాళ్ల కెళ్ళి, మళ్ళీ నాకోసం ఓ బొమ్మ కారు పట్టకొచ్చాడు, వాడు జార్చుకుంటే జార్చుకున్నాడులే, ఉన్నన్నాళ్ళు ఆడుకుంటాడు అని.

ఈ లోపల నాకు మా ఊరి వీధిబడిలో చదువుకొనే మహదావకాశం వచ్చింది. పెద్ద పండగలాగా, మా ఉషాకి , మా జయమ్మకి , మా మురళికి , మా కరుణాకి , ఇంకా అందరు పిల్లకాయలకు, పలకలు బలపాలు పంచేసి బడిలో చేరిపోయా. మా అయ్యోరొక పలక మీద, అ! ఆ! రాసిచ్చి, కొంత సేపు రుద్దిచ్చి, ఇంకా రుద్దు కొని రారా అని తరిమిపడ నూకినాడు, ఆయన పోయి కొడవంలో పడ్డ చేపలు తెచ్చుకోడానికి . నేను మా ఇంటికి లగెత్తినా, ఈ లగెత్తడంలో పలక, కిందబడి ఒక చిన్న పెచ్చు ఊడింది. పెచ్చు ఊడిన పలక నాకు నచ్చలా. దారిలో కాశీ రాయొకటి తీసుకొని, పలకను ముక్కలు ముక్కలుగా విరగ్గొట్టినా!. నాలుగు కర్రముక్కలు కలిపిన ఫ్రేమ్ మాత్రం మిగిలింది. మా ఉషాక

...more
View all episodesView all episodes
Download on the App Store

HarshaneeyamBy Harshavardhan