Harshaneeyam

నేనూ, నా మైనర్ సర్జరీ!


Listen Later

ఈ రోజు మా పదో తరగతి సహాధ్యాయని వాళ్ళ అమ్మాయి పెళ్ళికి స్నేహితువులమందరిమి హాజరయ్యాము. అలా వచ్చిన వారిలో, ఒక స్నేహితుడు రియాజ్ బాషా. తనకి ఆక్సిడెంట్ అయితే హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాడు కొంత కాలం క్రిందట. హాస్పిటల్ అంతా తనని చూడడానికి వచ్చిన జనాలతో నిండిపోతే ఆ డాక్టర్ కి తాను ఒక సమరసింహారెడ్డి ని అనే బిల్డ్ అప్ ఇద్దామనుకున్నాను అని చెప్పటంతో నాకు కూడా నా గతకాలపు ఘటన వలయాలు వలయాలు గా కళ్ళ ముందు కనపడటం మొదలయ్యింది. 2001 లో  నాకొక సర్జరీ అవసర మయ్యింది. దాని గురుంచి ఎంక్వయిరీ చేస్తే మన సీనియర్ బాలాజీ కూడా చేయించు కున్నాడని తెలిసి, ఆయనకీ చేసిన డాక్టర్ ఏ.ఎస్.రెడ్డి గారి దగ్గరే నేను కూడా అప్పోయింట్మెంట్ తీసుకున్నా. నేను భయపడుతుంటే, పాపం బాలాజీ చాలా ధైర్యం చెప్పాడు, ఇది చాలా మైనర్ సర్జరీ, నొప్పేమీ ఉండదు, ఉదయం చేయించుకుంటే మధ్యాన్నానికి ఇంటికెళ్లి పోవొచ్చు అంటూ. ఎంత ధైర్యం చెప్పినా, మొదటిసారి కావటం తో ఎక్కడో ఎందుకో తెలియని ఆందోళన. ఇంట్లో కూడా రెండు గ్రూపులు, ఒక గ్రూపేమో వీడు పిరికోడు వీడేమి చేయించు కుంటాడు అని రెచ్చ కొట్టే గ్రూప్, ఇంకో గ్రూప్ వద్దయ్యా! హర్షయ్య! అని కళ్లనీళ్లు పెట్టుకొనే సోదరీమణుల గ్రూప్. ఈ గ్రూప్ ల మధ్య పందేలు కూడా. ఓ రోజు రెచ్చ కొట్టే గ్రూప్ వెటకారాలు ఎక్కువ అవటం తో మొండిగా ధైర్యం నటిస్తూ వెళ్లిపోయా సుప్రియ తోడు రాగా డాక్టర్ గారి దగ్గరకు.

సర్జరీ అయ్యి బయటకి రాగానే మొత్తం సుప్రియ వాళ్ళ బంధువులందరూ హాస్పిటల్ కి వొచ్చి ఒకటే విచారణ. మా బామ్మర్ది గాడైతే ఓ పూల బొకే మరియూ ఓ పెద్ద గెట్ వెల్ సూన్ బోర్డు తో వొచ్చాడు. ఆ డాక్టర్ ఈ సందడంతా చూసాడు , నా దగ్గర కొచ్చాడు. నీ పాసు గూలా నేను నీలాటి వాడినెక్కడా చూడలేదయ్యా. ఎవరన్నా వాసెక్టమీ అంటే మొగుడూ పెళ్ళాలు మాత్రమే వొచ్చి ఎదో గుట్టుగా చేయించుకొని చప్పుడు చేయకుండా వెళ్ళిపోతారు. నువ్వెందయ్యా ఊరంతా డప్పు కొట్టుకొచ్చావ్, నరసింహ నాయుడా! అంటూ ఒకటే నవ్వు. ఆ తర్వాత తెలిసింది బొకే సుప్రియా ఐడియా అని. ఆ ఆపరేషన్ చేయించుకొని నేను పెద్ద హీరో అయిపోయా తనకి అని.

కానీ బాలాజీ చెప్పినంత వీజీ కాలా నాకు. ఒక వారం పట్టింది ఆ నొప్పి తగ్గడానికి. నడవడానికి కూడా కష్టపడ్డా. ఆ తర్వాత మన శ్రీధర్ గాడి వొంతు. వాడు కాల్ చేసాడు భయపడుతూ భయపడుతూ, ఏరా!  చేయించుకోవొచ్చా, నొప్పి ఉంటుందా, వున్నా ఎన్ని రోజులూ అంటూ. నేను కూడా, అచ్చు మన బాలాజీ లాగే,  అస్సలకేమీ భయపడకురా, చాలా మైనర్, పదికి చేయించుకున్నావా పదకొండు గంటలకి ఇంట్లో ఉండొచ్చు అంటూ చెప్పా. చేయించుకున్నాక వాడు ఎలాగూ బూతులు తిట్టాడనుకో. ఒక చిన్న మెసేజ్ వాసెక్టమీ చాలా సింపుల్ ప్రొసీజర్ మరియు చాలా సేఫ్, ట్యూబెక్టమీ తో పోలిస్తే. ఐన ఈ కథ మీకు అంటే మన స్నేహితులకి ఒక జీవిత కాలం లేట్ .

...more
View all episodesView all episodes
Download on the App Store

HarshaneeyamBy Harshavardhan