Telugu Sahityam Teasers

North & South


Listen Later

#నార్త్అండ్‌సౌత్

ఎలిజబెత్ గాస్కెల్

కార్మికునికి యజమానికి మధ్యన ఉన్న సమరసభావాన్ని, మానవబంధాన్ని గురించి తెలుపుతుంది ఈ నవలా విశ్లేషణ. చిన్నప్పటి నుంచి పల్లెటూరిలో పెరిగి ఆవాతావరణంలో హాయిగా ఉన్న మార్గరెట్ తన పిన్ని కూతురి పెళ్ళికి సాయానికి పట్నం వస్తుంది. అక్కడి అలవాట్లను, వాతావరణాన్ని అలవరచుకుని అందరికి తలలోని నాలుకలా ఉంటుంది. ఆ పెళ్ళిలో మార్గరెట్‌ని చూసి పెళ్ళికొడుకు అన్నగారు హెన్రి మార్గరెట్‌ని పెళ్లి చేసుకుందామనుకుంటాడు. కానీ మార్గరెట్‌ని ఇష్టపడదు. అయితే మార్గరెట్‌ తండ్రి హాల్ డబ్బులు బాగా సంపాదించాలని చక్కటి పల్లెటూరి వాతావరణం వదలి, పొగగొట్టాలతో కాలుష్యంతో నిండిన ఉత్తరంవైపుకు ప్రయాణమవుతారు. సాహిత్యం పై మక్కువ ఉన్న ధోర్టన్‌కి మాష్టారుగా హాల్‌ నియమింపబడతాడు.ధోర్టన్‌మార్గరెట్ భావాలకు ,ఆదర్శాలకు ముగ్ధుడై ఆమెను పెళ్లి చేసుకుంటానంటాడు.కానీ అతని తల్లికి ఇష్టముండదు. అక్కడి వాతావరణానికి మార్గరెట్ తల్లికి ఆరోగ్యం దెబ్బ తింటుంది. ఆమె మరణం తో నిర్వేదం లోకి వెళ్లిన హాలును అతని స్నేహితుడు బెల్ తన ఇంటికి తీసుకెళతాడు. కానీ భార్య మీద బెంగతో హాల్ మరణిస్తాడు.ఒంటరిదైన మార్గరెట్‌కు బెల్ తన ఆస్తిని రాసిస్తాడు. లండన్ లోని ఆర్ధిక అసమానతల కారణంగా ధోర్టన్‌ వ్యాపారం దెబ్బతింటుంది. తరువాత ఎలాంటి మార్పులు జరిగాయి? ధోర్టన్‌,మార్గరెట్లు కలుసుకున్నారా? ఈ విశ్లేషణలో వినండి.

---

#నార్త్అండ్‌సౌత్ శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.   

https://www.dasubhashitam.com/search?query=north

image :- http://images5.fanpop.com/image/photos/32000000/North-and-South-north-and-south-32024244-1920-1080.jpg

--- 

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.   ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.  

--- 

ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.  అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.  ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

...more
View all episodesView all episodes
Download on the App Store

Telugu Sahityam TeasersBy Dasubhashitam