Sign up to save your podcasts
Or

సత్యం శంకరమంచిగారి 'అమరావతి కథలు'నుండీ, "ఒక రోజెళ్ళిపొయింది."
ఇది పుస్తకరూపంలో వెలువడిన సంపుటిలోని తొమ్మిదవ కథ.
సుఖజీవి అని ఎవరిని అనాలి?
గొప్ప పదవులు, పెద్ద మేడలు, ఇతర సదుపాయాలు కలిగిఉన్నవారినా? ఏమీ లేకపోయినా, నలుగురిలో ఒకరుగా ఉంటూ, నలుగురి గుర్తింపు, సత్కారం కోసం పరుగులెత్తకుండా, తమకున్నదాంతో సరిపెట్టుకుంటూ, కాల గమనాన్ని, చుట్టూ ఉన్నవారిని గమనిస్తూ, ఏ నిష్కారణ వ్యధా లేకుండా, అశాంతికి లోనుకాకుండా తమ ప్రయాణం ముగించేవారినా?
తెలియని సంతోషాలనెక్కడెక్కడో వెతుక్కుంటూ, పరుగే తప్ప గమ్యం ఎరుగని ఎన్నో జీవితాలకంటే, నిమ్మళంగా నిశ్చలంగా నిశ్చింతగా వెళ్ళిపొయిన పిచ్చయ్యగారిలాంటి జీవితం నిజంగానే ఆనందమయం కదూ!?
రెండు మూడు పుటలు మించకుండా పాఠకులకు ఒక గొప్ప రసానుభూతి కలిగించగల కథలివన్నీ. తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తి, మక్కువ ఉన్నవారందరూ కొని చదివి దాచుకుని, మళ్ళీ మళ్ళీ చదువుకోవలసిన/చదువుకునే అపురూప కథా మాణిక్యాలలో ఒకటి భాషా ప్రియులు, సాహితీమిత్రులకు పరిచయం, బహుశా పునః పరిచయం అనటమే సబబేమో; చేయాలన్న చిన్న ప్రయత్నం, నానుండీ.
దయతో విన్న మీకు నా కృతజ్ఞతలు. నా ఈ ప్రయత్నం మీకు ఏమేరకు ఆనందాన్ని కలిగించినా, నేను కృతకృత్యుడనైనట్లే. ఇది ఏమాత్రం పేలవంగా తోచినా, అది నా ప్రయత్న లోపమే.
ధన్యవాదాలు,
కొండుభొట్ల. చంద్రశేఖర్
Twitter ID: @Chandu1302
By చంద్రశేఖర్ కొండుభొట్లసత్యం శంకరమంచిగారి 'అమరావతి కథలు'నుండీ, "ఒక రోజెళ్ళిపొయింది."