మన సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు అన్నీ ప్రకృతిలో ముడిపడి ఉంటాయి. పండుగల పేరిట మనం చెట్లను, జంతువులను, నదులను పూజిస్తాం. అంటే అవి ఎంతో విలువైనవని వాటివల్లనే మన జీవనం సుఖవంతంగా సాగుతోందని నమ్ముతాం. పేదసాదలకు సాయంచేస్తాం. జాతరలు, ఉత్సవాలు, తిరునాళ్ళ వంటి సంబరాలు అందరం కలిసిమెలిసి జీవించడానికి ఎంతగానో తోడ్పడతాయి.