Sign up to save your podcasts
Or

సత్యం శంకరమంచిగారి 'అమరావతి కథలు'నుండీ, "పందిరి పట్టిమంచం."
ఇది పుస్తకరూపంలో వెలువడిన సంపుటిలోని పదహైదవ కథ కథ.
చినముత్తెం నట్టువాంగన. యవ్వని. అందగత్తె. ఆమెని చూసి ఊరందరూ మోహావేశంలో మునిగితేలేవారే. తాను మాత్రం ఎవరినీ చూడలేదెన్నడూ. ఓనాడు అమరేశ్వరుడి గుళ్ళో ఆడుతుండగా బుల్లిరామయ్యని చూసింది. మనసిచ్చింది. పైసకు ఠికానా లేనివాడైనా, పెళ్ళయి పిల్లలున్న సంసారే అయినా, ఆతడే కావాలనుకున్నది. అతడినే చేరింది. ఇష్టపూర్వకంగా అతని మొదటి కుటుంబానికి సహాయం, సపర్యలు చేసింది.
అవసాన దశలో ఉన్ననాడు కూడా, తను బుల్లిరామయ్యల కోసం చేయించుకున్న పందిరి పట్టిమంచం ఆ కుటుంబానికి చెందాలని ఆశించింది, శాసించింది. బుల్లిరామయ్య తర్వాతి తరాలకు కూడా, చినముత్తెం ప్రేమే ఆ పందిరి పట్టిమంచమంతా నిండి భాసించింది.
రెండు మూడు పుటలు మించకుండా పాఠకులకు ఒక గొప్ప రసానుభూతి కలిగించగల కథలివన్నీ. తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తి, మక్కువ ఉన్నవారందరూ కొని చదివి దాచుకుని, మళ్ళీ మళ్ళీ చదువుకోవలసిన/చదువుకునే అపురూప కథా మాణిక్యాలలో ఒకటి భాషా ప్రియులు, సాహితీమిత్రులకు పరిచయం, బహుశా పునః పరిచయం అనటమే సబబేమో; చేయాలన్న చిన్న ప్రయత్నం, నానుండీ.
దయతో విన్న మీకు నా కృతజ్ఞతలు. నా ఈ ప్రయత్నం మీకు ఏమేరకు ఆనందాన్ని కలిగించినా, నేను కృతకృత్యుడనైనట్లే. ఇది ఏమాత్రం పేలవంగా తోచినా, అది నా ప్రయత్న లోపమే.
ధన్యవాదాలు,
కొండుభొట్ల. చంద్రశేఖర్
Twitter ID: @Chandu1302
By చంద్రశేఖర్ కొండుభొట్లసత్యం శంకరమంచిగారి 'అమరావతి కథలు'నుండీ, "పందిరి పట్టిమంచం."