Simi'savalanche

ప్రేమికుల దినోత్సవం-కచదేవయాని ప్రేమకథ


Listen Later

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈరోజు మనం కచదేవయాని కథ తెలుసుకుందాం.
కచ దేవయాని వృత్తాంతం మనకు మహాభారతం..మత్స్య పురాణంలో కనిపిస్తుంది. దేవతల గురువు బృహస్పతి కుమారుడు కచునికి...రాక్షస గురువు శుక్రాచార్యుడి కుమార్తె దేవయానికి మధ్య జరిగిన ప్రేమకథ ఇది. శుక్రాచార్యుడి వద్ద మృతసంజీవని విద్యను అభ్యసించడానికి భూలోకానికి వచ్చిన కచుణ్ణి చూసి దేవయానికి మోహితురాలవుతుంది. అతనిపై తన మనసు పారేసుకుంటుంది. అయితే మునికన్య కాబట్టి ఆ విషయాన్ని వ్యక్తీకరించలేక పోతుంది. మౌనంగానే ప్రేమిస్తుంటుంది. ఈ విషయం కచునికి తెలిసినా...గురువు పుత్రిక సోదరితో సమానమని మిన్నకుంటాడు. కచుడి విద్యాబుద్ధులు చూసి శుక్రాచార్యుడు మెచ్చుకుంటుండగా...అది నచ్చని అతని శిష్యులు పలుమార్లు కచుణ్ణి హతమారుస్తారు. కానీ ప్రతి సారి దేవయాని ప్రేమే కచుణ్ణి కాపాడుతుంటుంది. ఇలా కాదనకుని శుక్రాచార్యుని శిష్యులు ఒక సారి కచుణ్ణి హతమార్చి కాల్చి బూడిద చేసి సురాపానంలో కలిపి గురువుచే తాగిస్తారు. ఆ తర్వాత ఏమైంది? కచుణ్ణి దేవయాని కాపాడుకోగలిగిందా? కచదేవయాని ప్రేమను మనం ఎలా అర్థం చేసుకోవాలి? కచుణ్ణి ప్రేమించిన దేవయాని ఆ ప్రేమను పెళ్ళిదాకా తీసుకెళ్ళగలిగిందా? అనేక ఆసక్తికర అంశాలు ముచ్చటించడానికి ఇవాళ సీనియర్ జర్నలిస్ట్ రామదుర్గం మధుసూదనరావు మనతో ఉన్నారు.
...more
View all episodesView all episodes
Download on the App Store

Simi'savalancheBy simi