LOVE IS CHRIST

Premalo paddanu nenu premalo paddanu Anil bro telugu christian worship song


Listen Later

ప్రేమలో పడ్డాను … నేను ప్రేమలో పడ్డాను … 
ప్రేమలో పడ్డాను … నేను ప్రేమలో పడ్డాను నా యేసు ప్రభుని ప్రేమలో పడ్డాను 
ప్రేమలో వున్నాను నేను ప్రేమలో వున్నాను నా యేసు ప్రభుని ప్రేమలో వున్నాను 
స్వార్ధం కలిగిన ప్రేమకాదు – లాభంకోరే ప్రేమకాదు
కొద్ది కాలమే వుండే ప్రేమకాదు – ఆ శాశ్వతమైన యేసుని ప్రేమ 
మొహం కలిగిన ప్రేమ కాదు – మోసం చేసే ప్రేమకాదు
పై అందం చూసే ప్రేమకాదు – పరిశుద్ధమైన ప్రేమ 
ఇదేకదా ప్రేమంటే  – ఇదే కదా ప్రేమంటే – ఈలోక ప్రేమకాదు అగాపే ప్రేమ – దేవుని ప్రేమ ఇది /ప్రేమలో /
1. మొదటగా ప్రపోజ్ చేసింది నేను కాదు – నా ప్రియుడే తన ప్రేమ వ్యక్తపరచె 
మొదటగా ప్రేమించింది నేను కాదు – నా యేసే  తన ప్రేమ వ్యక్తపరచె 
కోరినాడు – పిలిచినాడు – నేను ఏదో మంచి వ్యక్తి నైనట్టు !
కుమ్మరించె ప్రేమమొత్తం – నేను తప్ప ఎవ్వరూ లేనట్టు !
ఆకాశాన తనలోతాను – పరిపూర్ణునిగా వున్న ప్రభువుకు 
భువిలో నాపై ప్రేమ ఎందుకో !
ఏమి తిరిగి ఇవ్వలేని ఈ చిన్న జీవిపైన – ప్రభువుకు అంత ప్రేమ దేనికో!
హే ఇంత గొప్ప ప్రేమ రుచి చూశాక – నేను ప్రేమించకుండ ఎట్ల వుంటాను 
అంత గొప్ప ప్రేమ చూపు ప్రేమికునికి I love you చెప్పకుండ ఎట్లగుంటాను  
 ఇదేకదా ప్రేమంటే  – ఇదే కదా ప్రేమంటే – ఈలోక ప్రేమకాదు అగాపే ప్రేమ – దేవుని ప్రేమ ఇది /ప్రేమలో /
2.  తన ప్రేమకు ఋజువేంటని నేనడుగకమునుపే – నా ప్రియుడు తన ప్రేమ ఋజువు పరచే 
తన ప్రేమకు ఋజువేంటని నేనడుగకమునుపే – నా యేసు  తన ప్రేమ ఋజువు పరచే 
పాపమనే కూపమందు నేను బందీనై యుండఁగా – పాపమనే అప్పుచేత బానిసై నేను అలసి యుండఁగా 
గగనపు దూరము దాటివచ్చి – సిలువలో చేతులు పారచాపి – నువ్వంటే నాకింత ప్రేమనే !
రక్తముతో నను సంపాదించి – నాకళ్ళళ్ళో కళ్ళు పెట్టి – నీపై పిచ్చి ప్రేమ నాకనే 
హే నన్ను తన సొత్తు   చేసుకున్నాడు  – నా పాపకట్లు తెంచి స్వేఛ్చ నిచ్చాడు 
మరల వచ్చి పేళ్ళి చేసుకుంటాడు – అని నిశ్చితార్ధం చేసుకొని వెళ్ళాడు 
ఇదేకదా ప్రేమంటే  – ఇదే కదా ప్రేమంటే – ఈలోక ప్రేమకాదు అగాపే ప్రేమ – దేవుని ప్రేమ ఇది /ప్రేమలో /
3.ప్రేమతో నా ప్రియుడు వ్రాసెను ప్రేమలేఖ – వాక్యమనే పరిశుద్ధ ప్రేమలేఖ
ప్రేమతో నా యేసు వ్రాసెను ప్రేమలేఖ– వాక్యమనే పరిశుద్ధ ప్రేమలేఖ
ఆ లేఖ చదువుతుంటే, నా ప్రియుని తలపులే నాలో నిండె
ప్రభుని ప్రేమ లోతు తెలిసి, నా యేసుపై ప్రేమ పొంగి పొరిలే
రేయింబగలు ప్రభు కావాలని, తనతో ఎప్పుడు కలిసుండాలని
నా ప్రాణము పరితపించెనే!
యుగయుగములు నన్నేలెడి వాడు, అతి త్వరలోనే రానున్నాడని
ఆత్మలో కలిగే ప్రేమ పరవశమే!
హే! వింతయైన నా యేసు ప్రేమ గూర్చి నేను –సర్వలోకమునకు చాటి చెపుతాను
యేసు రక్తమందు శుద్ధులైన వారే– ఆ ప్రేమ రాజ్యమందు ఉందురంటాను
ఇదేకదా ప్రేమంటే  – ఇదే కదా ప్రేమంటే – ఈలోక ప్రేమకాదు అగాపే ప్రేమ – దేవుని ప్రేమ ఇది /ప్రేమలో /
...more
View all episodesView all episodes
Download on the App Store

LOVE IS CHRISTBy Mitta Joy