Vennela - వెన్నెల

రాగిచెంబులోచేపపిల్ల_అమరావతికథలు


Listen Later

సత్యం శంకరమంచిగారి 'అమరావతి కథలు'నుండీ, "రాగిచెంబులో చేపపిల్ల"

ఇది పుస్తకరూపంలో వెలువడిన సంపుటిలోని పన్నెండవ కథ.

సుబ్బమ్మగారు మహా నిష్ఠగల ఇల్లాలు. ఎక్కడా లేని శ్రోత్రియం. వీర మడీ ఆచారం. పొద్దున్నెప్పుడో లేచిన మనిషి కోనేట్లో మడిస్నానం ముగించుకునా బిందెడు మంచినీళ్ళూ ఇంటికి చేరవేసి, ఆ కాస్తా ఉడకేసి, 'అన్నం సిద్ధం, భోయనానికి లేవండని భర్త సత్యనారాయణగారికి పిలుపందించేసరికా మహానుభావుడికి గుండెల్లో ప్రాణాలు కాస్తా గుడ్లల్లోకొచ్చేవి.

ఇంతటి మహా ఇల్లాలూ ఒహనాటి మధ్యాహ్నం దాహానికాగలేక, ఓ చెంబెడు నీళ్ళు మంచినీటిబిందెలోనుండీ ముంచుకు కాసిని తాగేప్పటికి.... రామ రామ! కోనేట్లో ఈదులాడే చేప్పిల్ల, కొంపకే దయచేసె! ఇంకెక్కడి నా ఆచారం, ఇంకెక్కడి నా శిష్టు అనావిడి ఊఁ, తెగ కంటనీరు పెట్టుకుంటుంటే, భర్త సత్యనారాయణగారే నచ్చచెప్పారావిడకి.  

నిజమే కదా!? అనుకుంటే చేప్పిల్ల, ఆలోచిస్తే అదే మత్స్యావతారం కాదూ?! అంటూ మైలా అని పైపై ఆలోచనల్తోటే మనం జీవితమంతా వెళ్ళదీస్తే, ఇంక తత్వం తెలిసేదెన్నడని? నహి నహి రక్షతి డుకృఞ్ కరణే.... 


రెండు మూడు పుటలు మించకుండా పాఠకులకు ఒక గొప్ప రసానుభూతి కలిగించగల కథలివన్నీ.

తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తి, మక్కువ ఉన్నవారందరూ కొని చదివి దాచుకుని, మళ్ళీ మళ్ళీ చదువుకోవలసిన/చదువుకునే అపురూప కథా మాణిక్యాలలో ఒకటి భాషా ప్రియులు, సాహితీమిత్రులకు పరిచయం, బహుశా పునః పరిచయం అనటమే సబబేమో; చేయాలన్న చిన్న ప్రయత్నం, నానుండీ.

దయతో విన్న మీకు నా కృతజ్ఞతలు. నా ఈ ప్రయత్నం మీకు ఏమేరకు ఆనందాన్ని కలిగించినా, నేను కృతకృత్యుడనైనట్లే. ఇది ఏమాత్రం పేలవంగా తోచినా, అది నా ప్రయత్న లోపమే.

ధన్యవాదాలు,

కొండుభొట్ల. చంద్రశేఖర్

Twitter ID: @Chandu1302

...more
View all episodesView all episodes
Download on the App Store

Vennela - వెన్నెలBy చంద్రశేఖర్ కొండుభొట్ల