Vennela - వెన్నెల

రెండుగంగలు_అమరావతికథలు


Listen Later


సత్యం శంకరమంచిగారి 'అమరావతి కథలు'నుండీ, "రెండు గంగలు."

ఇది పుస్తకరూపంలో వెలువడిన సంపుటిలోని నాల్గవ కథ.

రెండు మూడు పుటలు మించకుండా పాఠకులకు ఒక గొప్ప రసానుభూతి కలిగించగల కథలివన్నీ.

తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తి, మక్కువ ఉన్నవారందరూ కొని చదివి దాచుకుని, మళ్ళీ మళ్ళీ చదువుకోవలసిన/చదువుకునే అపురూప కథా మాణిక్యాలలో ఒకటి భాషా ప్రియులు, సాహితీమిత్రులకు పరిచయం, బహుశా పునః పరిచయం అనటమే సబబేమో; చేయాలన్న చిన్న ప్రయత్నం, నానుండీ.

వర్షంలో తడవటం తెలియని వారెవరూ ఉండరు. అలాగే ఏదో ఒక కాలంలో వర్షపు చినుకులు మనమీద పడుతుంటే ఆ ఆకాశగంగ కురిపించే అమృతధారలలో తడిసి ఈ క్షణానికి ఈ ముక్తి చాలని తన్మయమందని మనిషి, మనసు కూడా ఎక్కడా ఉండదేమో. సత్యంగారి ఈ కథ మనలని మళ్ళీ ఆ వాన నీటిలో ఆడుకొమ్మని పురికొల్పుతుంది. ఏనాటికైనా ఆ అనుభవాలు, అనుభూతులే శాశ్వతమని, అందుకోసమే జీవించమని పురికొల్పుతుంది.

దయతో విన్న మీకు నా కృతజ్ఞతలు. నా ఈ ప్రయత్నం మీకు ఏమేరకు ఆనందాన్ని కలిగించినా, నేను కృతకృత్యుడనైనట్లే. ఇది ఏమాత్రం పేలవంగా తోచినా, అది నా ప్రయత్న లోపమే.

ధన్యవాదాలు,

కొండుభొట్ల. చంద్రశేఖర్

...more
View all episodesView all episodes
Download on the App Store

Vennela - వెన్నెలBy చంద్రశేఖర్ కొండుభొట్ల