Abhaya Ayurveda  Telugu Podcast

శీతాకాలంలో ఆయుర్వేదం ప్రకారం మనం తప్పకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?


Listen Later

ఏ కాలంలోనైనా ఆరోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. శీతాకాలంలో కూడా పలు రకాల వ్యాధులు ప్రజలను భయపెడుతుంటాయి. శీతాకాలంలో గుండె జబ్బులు విజృంభిస్తాయి. హృదయ సంబంధ వ్యాధులు ఉన్న వారు ఈ కాలంలో జాగ్రత్తలు పాటించాల్సిందే. మన దేశంలో కూడా శీతాకాలంలో ఉష్ణోగ్రతలు ఘనంగా తగ్గుతాయి. ఒక సమయంలో సున్నా డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతుంటాయి.దీంతో ఈ కాలంలో మనం అప్రమత్తంగా ఉంటే రోగాల నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది.

శీతాకాలంలో చల్లని పదార్థాలు తినకూడదు. వేడిగా ఉన్నప్పుడే తింటే మంచిది. ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. చలికాలంలో రక్తపోటులో కూడా హెచ్చుతగ్గులు రావడం సహజమే. దీంతో వేడిగా ఉన్న ఆహార పదార్థాలనే తీసుకుంటే ప్రయోజనం. బయటకు వెళ్లేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నపిల్లలు స్వెటర్లు వేసుకుంటేనే చలి నుంచి రక్షణ కలుగుతుంది. వృద్ధులు కూడా వేడిగా ఉండేందుకు ఉన్ని దుస్తులు ధరించడం శ్రేయస్కరం. దీంతో వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు వీలవుతుంది.


కూల్ డ్రింక్స్, తీపి పదార్థాలు, చల్లనివి తీసుకోకూడదు. సాధ్యమైనంత వరకు వాటికి దూరంగా ఉంటేనే మేలు కలుగుతుంది. ఉష్ణోగ్రతను పెంచుకునేందుకు కాఫీ, టీ వంటివి తాగుతూ శరీరాన్ని వేడి చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువా ఉండటంతో దాని నుంచి రక్షించుకునేందుకు పలు దుస్తులు ధరిస్తేనే మంచిది. చలి నుంచి రక్షించుకునేందుకు పలు మార్గాలు అన్వేషించాలి. చలి తీవ్రతతో పలు రోగాలు విజృంభించే వీలున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే.

...more
View all episodesView all episodes
Download on the App Store

Abhaya Ayurveda  Telugu PodcastBy Dwani Voice Services