Sign up to save your podcasts
Or

సత్యం శంకరమంచిగారి 'అమరావతి కథలు'నుండీ, "శివుడు నవ్వాడు."
ఇది పుస్తకరూపంలో వెలువడిన సంపుటిలోని ఎనిమిదవ కథ.
భగవత్సేవల పేరిట హుండీ నింపటానికి మార్గాలు అన్వేషించే గుడి అధికారులు, దర్శనానికీ, పూజలకూ టిక్కెట్లు అమ్మటంతో పాటు ఇంకేమేం చేయవచ్చని ఉపాయాలు వెతుకుతుంటారు. మనసంతా ఆ శివయ్యనే నింపుకున్న గుడ్డి గంగన్న మాత్రం మానవ సేవ కూడా ఈశ్వరార్చనే అని నమ్మిన వేదాంతి. ఆ భక్తుడికి ప్రసాదం అందటం లేదంటే, కులగోత్రాలు, సామాజిక దూరాలు విస్మరించి; తన వంతుకు వొచ్చిన మహానైవేద్యాన్ని సైతం, తన చేత్తో ఆ గుడ్డి గంగన్నకి అందించగల మరొక ధార్మికుడు, స్వామివారి అర్చకుడు, మహదేవయ్య. భగవంతుడిని ముందుగా నీలోనూ, తోటివారిలోనూ వెతికి తెలుసుకోమని నేర్పే అద్భుతమైన సందేశం. భక్తి మార్గం, ఈ కథ!
రెండు మూడు పుటలు మించకుండా పాఠకులకు ఒక గొప్ప రసానుభూతి కలిగించగల కథలివన్నీ. తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తి, మక్కువ ఉన్నవారందరూ కొని చదివి దాచుకుని, మళ్ళీ మళ్ళీ చదువుకోవలసిన/చదువుకునే అపురూప కథా మాణిక్యాలలో ఒకటి భాషా ప్రియులు, సాహితీమిత్రులకు పరిచయం, బహుశా పునః పరిచయం అనటమే సబబేమో; చేయాలన్న చిన్న ప్రయత్నం, నానుండీ.
దయతో విన్న మీకు నా కృతజ్ఞతలు. నా ఈ ప్రయత్నం మీకు ఏమేరకు ఆనందాన్ని కలిగించినా, నేను కృతకృత్యుడనైనట్లే. ఇది ఏమాత్రం పేలవంగా తోచినా, అది నా ప్రయత్న లోపమే.
ధన్యవాదాలు,
కొండుభొట్ల. చంద్రశేఖర్
Twitter ID: @Chandu1302
By చంద్రశేఖర్ కొండుభొట్లసత్యం శంకరమంచిగారి 'అమరావతి కథలు'నుండీ, "శివుడు నవ్వాడు."