Sign up to save your podcasts
Or

ఇది పుస్తకరూపంలో వెలువడిన సంపుటిలోని రెండవ కథ.
కూటికి అలమటిస్తూ మురికి గుంటలలో ఏదైనా చిన్నా చితకా వస్తువేమైనా దొరుకుతుందేమో, దాన్ని అమ్ముకుని ఒక్క మెతుకైనా గొంతుకిందకి పంపిద్దామని ఆ మురికి, బురదల మధ్యనే జీవితం వెళ్ళబుచ్చే అట్టడుగు ఆకలి కడుపులు. అన్నీ వుండీ, వాటన్నిటికీ మూలస్తంభమై నిలిచే ఆశ, ఎక్కడ ఏమున్నా అది తమకే స్వంతమవాలనే దోపిడీ వ్యవస్థను పెంచి పోషించే బలవంతులూ.... సమాజం ఒకప్పుడూ ఇప్పుడూ కూడా ఇంతే. ఎంత పెద్ద వరదలొచ్చినా కొండలెన్నడు కొట్టుకుపోయాయనీ, కాలం ఎన్ని తరాలు చూసినా మనలో సాటివాడికోసం మనం, అన్న భావం ఏనాడు పొడసూపిందనీ!
సత్యంగారి ఈ కథ ఆసాంతమూ మనల్ని మనముందే నిలదీస్తుంది. మారండి, మనుషులుగా బతకండని హెచ్చరిస్తుంది.
రెండు మూడు పుటలు మించకుండా పాఠకులకు ఒక గొప్ప రసానుభూతి కలిగించగల కథలివన్నీ. తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తి, మక్కువ ఉన్నవారందరూ కొని చదివి దాచుకుని, మళ్ళీ మళ్ళీ చదువుకోవలసిన/చదువుకునే అపురూప కథా మాణిక్యాలలో ఒకటి భాషా ప్రియులు, సాహితీమిత్రులకు పరిచయం, బహుశా పునః పరిచయం అనటమే సబబేమో; చేయాలన్న చిన్న ప్రయత్నం, నానుండీ.
దయతో విన్న మీకు నా కృతజ్ఞతలు. నా ఈ ప్రయత్నం మీకు ఏమేరకు ఆనందాన్ని కలిగించినా, నేను కృతకృత్యుడనైనట్లే. ఇది ఏమాత్రం పేలవంగా తోచినా, అది నా ప్రయత్న లోపమే.
By చంద్రశేఖర్ కొండుభొట్లఇది పుస్తకరూపంలో వెలువడిన సంపుటిలోని రెండవ కథ.