Kalyana's I My Voice - Telugu Podcast - నేను నా స్వరం

Telugu Story | ఇంగ సెలవా మరి? | Kalyana's I My Voice


Listen Later

Telugu Story | ఇంగ సెలవా మరి? | Kalyana's I My Voice

రచయిత్రి : శ్రీమతి యం.ఆర్.అరుణ కుమారి

అరుణకుమారి కి అభినందనలు 

ఇంగ సెలవా మరి కథ ను సజలనయనాలతో చదివాను రెండో సారి నా శ్రీమతి కి వినిపిస్తుంటే తాను వింటూ చెమ్మగిల్లిన కళ్ళతో నీకు నమస్కరించింది 

నీ కథలో ఆలుమగల అనుబంధ ఔన్నత్యం 

ఉమ్మడికుటుంబo కోడలి బాధ్యతాయుత అనుబంధాల సౌగంధాన్ని 

యజమాని సేద్య కార్మికుల మధ్య ఉండాల్సిన మానవీయతను 

అపూర్వంగా చెప్పావు తల్లి మా అమ్మ నిర్వహించిన పాత్ర ,ఇప్పుడు నా భార్య చేస్తున్న పాత్రత గుర్తుకొచ్చి ఏడ్చేసాను 

రాత్రంతా మెలకువ వచ్చినప్పుడల్లా ఇంగ సెలవా మరి అన్న కథ నుండి సెలవు తీసుకోలేక పోయాను 

ఇలాంటి మానవ సంబంధాల కథ ఇటీవల చదవలేదు 

కథకోసం ఎన్నుకొన్న రాయలసీమ జీవభాష పై నీకున్న ప్రేమ - బాధ్యత కథకోసం ఎన్నుకున్న చల్లని భార్య సమాధి వేదిక నాకు విస్మయ ఆనందం కలిగించింది 

ఆనందాన్ని అస్ర నైవేద్యాన్ని ఏకకాలం లో పాఠకుడినైనా నానుండి తీసుకున్నావు జేజేలు నీకు నీకథకు ధన్యోహం తల్లీ !!


- సుద్దాల అశోక్ తేజ

...more
View all episodesView all episodes
Download on the App Store

Kalyana's I My Voice - Telugu Podcast - నేను నా స్వరంBy Venkata Kalyana