Basics To Bloom

The Chant! Ganesh Atharvana Shirsha


Listen Later

This is a hybrid interview - conversation episode "The Chant", about an amazing chant of Lord Ganesha, recited at the Siddhi Vinayak Temple, Mumbai, India. A powerful & miraculous chant, translated into regional language i.e. Telugu, by my honorable guest - Dr. Sridevi Swami...enjoy this blissful chant....Ganesh Atharvana Shirsha....ఓం గణేశాయనమః ఓం గం గణపతయే నమః ఓం లక్ష్మి గణపతే నమః భగవంతుడైన గణేషునకు ప్రణామము.. స్వామీ! నువ్వే ప్రత్యక్ష తత్వ స్వరూపుడవు... కర్తవు, దర్తవు. , హర్తవు అంటే చేసే వాడవు, ధరించేవాడవు.. హరించేవాడవు నువ్వే. సర్వ స్వరూపాల్లో తేజరిల్లే బ్రహ్మవు నిశ్చయంగా నువ్వే... నిత్యుడవు... ఆత్మస్వరూపుడువు నువ్వే.. ఋతాన్ని చెబుతూ, సత్యాన్ని పలుకుతున్నాను. నన్ను వక్తను, శ్రోతను, దాతను నువ్వు రక్షించు. వ్యాఖ్యానించే ఆచార్యుని శిష్య సహితంగా నువ్వు రక్షించు..వాంగ్మయస్వరూపుడవు.. చిన్మయుడవు... ఆనందమయుడవు.. బ్రహ్మమయుడవు.. సచ్చిదానంద స్వరూపుడవు.. అద్వితీయుడవు. ప్రత్యక్ష బ్రహ్మమూర్తివి. జ్ఞాన, విజ్ఞానమయుడవు నువ్వే.. విశ్వమంతా నీలోనే కానవస్తుంది... పంచమహా భూతాది స్వరూపుడవు , పరా,పశ్యoతి, మధ్యమా వైఖరి, అనే నాలుగు వాగ్రూపాలు నువ్వే. సత్వ రజస్తమోగుణాలకు, భూతభవిష్యత్ వర్తమానాలకు నువ్వు అతీతుడవు. మూలాధారంలో సర్వదా ప్రకాశించే వాడవు.. ఇచ్చా, జ్ఞాన, క్రియాశక్తులు మూడు నువ్వే. నిన్ను నిత్యం యోగీశ్వరులు ధ్యానిస్తూ ఉంటారు. బ్రహ్మ విష్ణు, మహేశ్వర, ఇంద్రాగ్ని, వాయు, సూర్య, చంద్ర స్వరూపుడవు నువ్వే. భూలోక, భువర్లోక, స్వర్లోకాలుమూడు నీ రూపాలే.... ఓంకార శబ్ద బ్రహ్మ స్వరూపుడవు నువ్వే. గణశబ్దంలోని గకారం అనుస్వారంతో కలిసి ప్రణవంతో కూడి నీ బీజమంత్రం అవుతుంది. ఓం గం గకారం పూర్వరూపం కాగా, ఉకారం మధ్యమ రూపంలో ఉండ, అనుస్వారం అంతంలో ఉంది. సంహిత సంధీస్థానంలో ఉంది. ఇదే గణేశ విద్యగా ఖ్యాతి పొందినది. ఈ మహా మంత్రానికి ఋషి గణకుడు... ఛందస్సు నిజ్రుత్ గాయత్రి దేవత. ఓం శ్రీ మహా గణాధిపతయే నమః. ఇది మహా మంత్రం... ఏకదంతుని మేము స్మరించెదము.. వక్రతుండుని ధ్యానించెదము. గజముఖుడు మమ్ము ప్రేరేపించుగాక. ఏకదంతముతో, చతుర్భుజాలతో, పాశాంకుశ అభయవరద ముద్రలు దాలిచి, మూషిక చిహ్నం కలిగి, అరుణ వర్ణంతో వ్రేలు బొజ్జ కలిగి, చేటలవంటి చెవులతో శ్వేతవస్త్రాన్ని ధరించి, దేహంపై రక్తచందన లేపంతో, ఎర్రని పువ్వులతో పూజింపబడి, భక్తులపై కరుణా కటాక్ష వీక్షణాలను ప్రసరించునట్టి దేవుణి సర్వజగత్కారుడిని, అచ్యుతుని, సృష్టికి ఆదిలో అవతరించిన వాడిని ప్రకృతి పురుషులకు అతీత మై న వాడిని .. శ్రీ మహా గణపతిని నిత్యం ధ్యానిస్తాను.. దేవనాయకుడు, ప్రమధాధిపతి , లంబోదరుడు, ఏకదంతుడు, విఘ్న వినాశకుడు, శివకుమారుడైన వరదమూర్తికి వందనము.. ఇది అధర్వణ వేదోక్తము. ఈ మంత్రం ద్వరా తపస్సు చేసేవాడు భయదూరుడవుతాడు. గణాధిపతిని దూర్వాంకురాలతో పూజించేవాడు కుబేరునితో సమానుడు అవుతాడు. పేలాలతో హోమం చేస్తే యశస్సు, మేధస్సు లభిస్తాయి.. లడ్డులతో, ఉండ్రాళ్ళతో ఆరాధించేవాడు అభీష్టాలను పొందుతాడు. గోగ్రుత యుక్తమైన సమిధలతో హోమం చేసేవాడు సర్వాన్ని పొందుతాడు. విద్యుక్తంగా ఈ విద్యను ఎనమండుగురు భ్రాహ్మణులకు ఉపదేశించినవాడు భాస్కర సమ ప్రభాభాసమానుడవుతాడు . సూర్యగ్రహణకాలంలో కాని, ప్రతిమా సమీక్షంలో కాని జపించిన మంత్రం సిద్ధిస్తుంది.. అట్టి సిద్ధిని పొందినవాడు ఉద్దండ విజ్ఞ విముక్తుడవుతాడు. మహాదోషదూరుడై , సర్వజ్ఞుడై తేజరిల్లుతాడు. ఈ గణపతి ఉపనిషత్తు అధర్వణ వేదోక్తమైనది.. మంగళం మహాత్ ... ఓం గం గణపతయై నమః .


Dr. Sridevi Swami is a Pharmaceutical & food quality consultant, spiritual & relationship advisor & counsellor. She is a blogger. She is into social services - women empowerment, general healthcare & wellness etc. Feel free to approach her for any type of help, need & support:

Dr. Sridevi Swami - 09000010870


Stay connected with Basics To Bloom:

https://linktr.ee/nafisa.n

...more
View all episodesView all episodes
Download on the App Store

Basics To BloomBy Nafisa Nazneen

  • 5
  • 5
  • 5
  • 5
  • 5

5

5 ratings