Telugu Sahityam Teasers

The Girl In The White Ship


Listen Later

#దగర్ల్‌ఇన్‌దవైట్‌షిప్

పీటర్ టౌన్సెండ్


ఎన్ని విపత్తులు జరిగినా, ఎన్ని ప్రకృతి విలయాలు జరిగినా మనిషి భగవంతునిపై నమ్మకాన్ని కోల్పోకూడదు. ఈ సృష్టిలో ఏది జరిగినా అది మన మంచి కోసమే అనుకోమంటారు. మనిషిని ఏదో ఒక ఆశ నడిపిస్తుంది. మనం ఉన్న ప్రదేశాలు నివాసయోగ్యాలు కానప్పుడు ఆహారం దొరకకపోయినా, అక్కడి రాజులుగాని, ప్రభుత్వంగాని నిరంకుశంగా ఉన్న అక్కడ బతకడం కష్టమవుతుంది. ప్రాణాలకోసం మనిషి పోరాటం సాగించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, బతకాలన్న తీవ్రమైన కాంక్ష మనిషిని విజేతని చేస్తుంది. దక్షిణ వియాత్నం‌లోకి వలస వచ్చిన చైనీయుడు టింహా వాచీ రిపేర్ చేసుకుంటూ, ఇల్లు, ఆస్థి సంపాదించుకున్నాడు.ఇతనికి 4 అబ్బాయిలు, ఒక్కగానొక్క అమ్మాయి హ్యూ హ్యూ. వాచీలు బాగుచేస్తూ డబ్బులు కూడబెడుతూ బంగారు కణికలు కొని దాచేవాడు టింహా. బంగారం ఇస్తే వారిని రహస్యంగా ఆ దేశం నుంచి తప్పిస్తారని ఆశ. టింహా దగ్గర 2 సార్లు డబ్బులు తీసుకుని మోసం చేస్తారు. మూడవ సారి దేశమంతా పండగ హడావిడిలో ఉండగా ఓడలో ఆ దేశం నుంచి తప్పించుకుందాం అనుకుంటారు. కానీ ఎవరికి వారుగా విడిపోతారు. ఓడ లో హ్యూ, అతని అన్న ట్రాంగ్ ఒక 50 మందితో ప్రయాణం సాగించగా, ఆహరం లేక అందరు చనిపోగా సముద్రంలో చివరికి 8 మందితో హ్యూ ఇంకో ఓడ ఎక్కాలనుకుంటారు. కళేబరాల మధ్యన అస్థిపంజరంలా, తిండి లేక ఆ అమ్మాయి హ్యూ యొక్క పరిస్థితి ఏమిటో ? చివరికి ఆ అమ్మాయి తన తల్లి తండ్రులను కలుసుకుందా లేదా? ఇవన్నీ ఈ నవలావిశ్లేషణలో వినండి.

Image : https://i.pinimg.com/564x/fb/15/81/fb15815d8c3d40381851a105466d9dc4.jpg

---

#దగర్ల్‌ఇన్‌దవైట్‌షిప్ శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.   

https://www.dasubhashitam.com/ab-title/pc-the-girl-in-the-white-ship

––– 

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.   ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.  

--- 

ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.  అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.  ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

...more
View all episodesView all episodes
Download on the App Store

Telugu Sahityam TeasersBy Dasubhashitam