నవీన కవిత

అఆఇఈ


Listen Later

అవసరం నిన్ను నడిపిస్తుంది

ఆలోచన నీకు దారిచూపుతుంది


ఇరుకైన నీ ఇంటినుండి


ఈ నగరాన నీ అడుగు పడింది


అవకాశం పని ఇస్తుంది


ఆ అనుభవం నీకు అక్కరొస్తుంది


ఇల్లు ఇల్లాలు పిల్లలు ఇలా 


ఈ లోకాన నీకంటూ ఒక తోడు దొరుకుతుంది


అవమానం ఎదురైతే కానీ


అది నీలో కసిని పెంచుతుంది


ఆరాటం దానిని కొనసాగిస్తుంది


ఇనుముని కొలిమిలో కాల్చితేనే గొడ్డలవుతుంది


ఈరోజు నువ్వు పడ్డ బాధే నిన్ను పైకి లేపుతుంది


అనుమానం అడ్డుపడుతుంది

ఆరంభంలోనే నిన్ను ఆపేస్తుంది


ఇంతదాకా వచ్చాక ఇంక ఆలోచించడానికి ఏముంది


ఈపూట ఓపికపడితే ఇన్నాళ్ల నీ శ్రమకు ఫలితముంటుంది


అతిగా భయపడితే పతనం అక్కడే మొదలవుతుంది


ఆవేదనలో బ్రతుకు ముగిసిపోతుంది


ఇది నీకు నచ్చినా నచ్చకపోయినా జరిగితీరుతుంది


ఈ పొద్దు గడిచాక నీకు అర్థమవుతుంది


Please check out my YouTube channel:

www.youtube.com/c/NS360

...more
View all episodesView all episodes
Download on the App Store

నవీన కవితBy Naveen Chenna