నీ పసితనంలో తను మురిసిపోయాడు
తన గుండెపై నిన్ను మోసాడు
తన చేతిలో ఎప్పుడూ దాచాడు
నీ తొలి అడుగులకు తను మార్గం చూపాడు
నాన్నంటే
నీ ప్రపంచపు తలుపు
నాన్నంటే
నువు గెలిచే గెలుపు
తన కష్టాంన్నంతా మరిచిపోతాడు
నీ నవ్వుని చూసి
నీ కష్టాంన్నంతా భరిస్తాడు
నీకు భరోసా చూపి
నాన్నంటే
నీ అభయం
నాన్నంటే
నీ విజయం
మనం కోరుకున్నవి మనకిచ్చి
తన అవసరాలను మాత్రం
అందని కోరికలుగా మార్చుకున్నాడు
నాన్నెప్పుడూ వెనుకబడడు
తాను వెనకుండి నిను ముందుకి నడుపుతాడు
తన గౌరవాన్ని తీసుకొని పెరిగిన మనం మాత్రం
తనకు అగౌరవాన్నే మిగిలిస్తున్నాం
నాన్నెప్పుడూ outdated కాదు
నిన్ను update చేసే candidate
ఇప్పటివరకు అడిగింది చాలు
ఇకనుంచైనా ఇద్దాం
ప్రేమని, అభిమానాన్ని ……. తన గౌరవాన్ని
*నాన్నంటే నీ సేవకుడు కాదు*
*నాన్నంటే నీ నాయకుడు*
Happy Father’s Day