ఏదో ఒక దశలో మనం
ఇంకొకరి జీవితాన్ని ప్రభావితం చేయగలం
ఆ సమయంలో మనం తీసుకునే ఒక చిన్న నిర్ణయం
కాగలదు ఆ వ్యక్తి జీవితంలో ఒక కీలక మలుపుకి కారణం
ఒకరి అవసరాన్ని అవకాశంగా
నిస్సహాయ స్థితిని తమకు అనుకూలంగా
వాడుకుని జనాలతో ఆడుకోవడానికి
అలవాటు పడ్డ మనుషులున్న
సమాజంలో ఉన్నాం మనం
అడవిని కాల్చే మంటలో
దారిని చూపించే దీపంలో
ఉన్నది ఒకటే అగ్ని కణం
శక్తి ఉన్నంత మాత్రాన ఉండదు
అందరికీ సాయం చేసే గుణం
పేరు కోసమో
పుణ్యం కోసమో
పేపర్ లో ఫోటో కోసమో
తిరిగి సాయం చేస్తారు అనే నమ్మకమో
కారణం ఏదైనా
ఒకరికి ఒకరు సాయం చేసుకోవటం ఒక మంచి లక్షణం
సమాజానికి హితం ఈ పరిణామం
నీ వ్యక్తిత్వానికి అలంకారం