ఈరోజు మనం వినబోయే కథలో అన్నీ చిన్నవే! మునక్కాయంత ముసలమ్మ, పొట్లకాయంత పోలీసు, దొండకాయంత దొంగ... కానీ సమస్య మాత్రం బంగాళదుంపంత పెద్దది! 😄
ఈ కథ వింటుంటే మీకు నవ్వు ఆగదు. ఎందుకంటే ఇందులో మనుషులంతా కూరగాయల సైజుల్లో తిరుగుతుంటారు! వినేద్దామా... చిలిపి కథ!ఉసిరికాయంత ఊరిలో మునక్కాయంత ముసలమ్మకి బంగాళదుంపంత బంగారం ఉంది. బంగాళదుంపంత బంగారాన్ని బీరకాయంత బీరువాలో పెట్టి తాటికాయంత తాళం వేస్తుంది. అది దొండకాయంత దొంగోడు చూసి తాటికాయంత తాళం పగలగొట్టి బంగాళదుంపంత బంగారాన్ని ఎత్తుకుపోతాడు. అప్పుడు మునక్కాయంత ముసలమ్మ పొట్లకాయంత పోలీసుకు కాకరకాయంత కంప్లైంటు ఇస్తుంది.
అప్పుడు పొట్లకాయంత పోలీసు జీడికాయంత జీపులో అనసకాయ అంత అమీనును తోలుకొని లవంగమంత లాటి తీసుకొని పచ్చిమిరపకాయలాంటి ప్రశ్నలు అడిగి బెండకాయంత బేడిలు వేసి దొండకాయంత దొంగోడిని జామకాయ అంత జైలులో వేస్తాడు.
మునక్కాయంత ముసలమ్మకు బంగాళదుంపంత బంగారం ఇస్తాడు పొట్లకాయంత పోలీసు.
మునక్కాయంత ముసలమ్మ, పొట్లకాయంత పోలీసు, దొండకాయంత దొంగ ఉంటే... వాళ్ల ఇంట్లో తలుపు ఎంత పెద్దగా ఉండేదో? 😄
సరే సరే... ఇప్పుడు మీరు కూడా ఇంట్లో ఉన్న వాళ్లను కూరగాయలతో పోల్చి పిలవకండి. లేదంటే అమ్మ 'మిరపకాయంత అల్లరి' అని మీకే బిరుదు పెట్టేస్తుంది! 🌶️😆