గూగుల్ పే లో మూడు నెలలకు 5 రూపాయలు వస్తే ఎగిరి గంతెస్తాం..
పెట్రోల్ మీద రోజూ కొంచెం పెంచి నెలకు 50 రూపాయలు దోచేస్తుంటే పట్టించుకోము..
కూరగాయలు అమ్మే ముసలమ్మ దగ్గర గీచి గీచి బేరమాడి 5 రూపాయలు మిగిల్చి ఏదో మిగిల్చినట్టు ఫీల్ అవుతామ్..
పక్కకొచ్చి 20 రూపాయలతో సిగరెట్ కాలుస్తాం..
మందు బాటిల్ 1500 పెట్టి దర్జాగా కొంటాం..
అదే 1500 వందలతో ఇంట్లోకి ఫ్రూట్స్ కొనడానికి ఆలోచిస్తాం..
వచ్చే పైసా గురించి ఆలోచిస్తాం కానీ పోయే రూపాయి గురించి పట్టించుకోము..
మన మధ్యతరగతి ఆలోచనలు ఇలా ఉంటాయి అని తెలుసు కాబట్టే..
ఆసరా...భరోసా అని 10 వేలు అకౌంట్ లో వేసి 20 వేలు పన్నుల రూపంలో పిండుతుంటాయి ప్రభుత్వాలు..
వచ్చేది అదృష్టం కింద లెక్క..
పోయేది ఖర్చు కింద లెక్క...
మన అమాయకత్వమే వాళ్ళ బలం...
కోడిని కోసుకు తినాలి అంటే నాలుగు నూకలు వేస్తాం ..పట్టి కోసుకు తింటాం..
కోడి నూకలకు కక్కుర్తి పడుద్ది..
మనం పథకాలకు కక్కుర్తి పడతాం..
కోడికి మనకు పెద్ద తేడా లేదులే..
మన కాళ్ళ మీద మనలను నిలబెట్టేవాడు మనకు వొద్దు..
మన కాళ్ళు విరగ్గొట్టి వీల్ చైర్ ఇచ్చేవాడు మనకు ముద్దు..
మన ఆలోచనలు మారనంత వరకు పాలకుల తీరు మారాలి అనుకోవడం అమాయకత్వం ..
అనుభవించు రాజా..