
Sign up to save your podcasts
Or


నిన్ను చూసే క్షణం కోసం నిరీక్షణం
నీ సమక్షంలో యుగం ఒక క్షణం
నీతో నేను గడిపే ప్రతీ క్షణం
అంతులేని సంతోషంలో ప్రదక్షిణం
అందరికీ విలువైంది బంగారం
అందుకే నువ్వు నా బంగారం
నీ స్వరం వింటే ఏదో పరవశం
నువ్వు కనపడకుంటే నాలో కలవరం
నిన్ను చూసిన క్షణం అది మటుమాయం
ఏవో ఊసులతో రేయంతా నీతో జాగారం
నిదురే రాదు నీతో మాట్లాడుతుంటే
దిగులేలేదు నువ్వు నాతో ఉంటే
దిగులేలేదు నువ్వు నాతో ఉంటే
దేవుడు దిగివచ్చి వరం కోరుకోమంటే
నీతో కలకాలం ఇలా కలిసుండే వీలుంటే
ఇక ఏ వరం కావాలి నాకు అంతకంటే
కదిలే భూమి సాక్షిగా
కరిగే కాలం సాక్షిగా
వీచే గాలి సాక్షిగా
పూచే పువ్వు సాక్షిగా
పారే ఏరు సాక్షిగా
త్రాగే నీరు సాక్షిగా
వెలుగునిచ్చే ఆ సూరీడు సాక్షిగా
నువ్వుంటే చాలు నా జతగా
ప్రతీ జన్మలో ఇలా ఇంతే ప్రేమగా నాకు భార్యగా
మిగతావాన్ని నాకొదిలేయ్
నాతో కలిసి అడుగై
బ్రతుకంతా నీకు తోడుంటా
కంటిపాపలా నిన్ను కాపాడుకుంటా
Please check out my YouTube channel:
www.youtube.com/c/NS360
By Naveen Chennaనిన్ను చూసే క్షణం కోసం నిరీక్షణం
నీ సమక్షంలో యుగం ఒక క్షణం
నీతో నేను గడిపే ప్రతీ క్షణం
అంతులేని సంతోషంలో ప్రదక్షిణం
అందరికీ విలువైంది బంగారం
అందుకే నువ్వు నా బంగారం
నీ స్వరం వింటే ఏదో పరవశం
నువ్వు కనపడకుంటే నాలో కలవరం
నిన్ను చూసిన క్షణం అది మటుమాయం
ఏవో ఊసులతో రేయంతా నీతో జాగారం
నిదురే రాదు నీతో మాట్లాడుతుంటే
దిగులేలేదు నువ్వు నాతో ఉంటే
దిగులేలేదు నువ్వు నాతో ఉంటే
దేవుడు దిగివచ్చి వరం కోరుకోమంటే
నీతో కలకాలం ఇలా కలిసుండే వీలుంటే
ఇక ఏ వరం కావాలి నాకు అంతకంటే
కదిలే భూమి సాక్షిగా
కరిగే కాలం సాక్షిగా
వీచే గాలి సాక్షిగా
పూచే పువ్వు సాక్షిగా
పారే ఏరు సాక్షిగా
త్రాగే నీరు సాక్షిగా
వెలుగునిచ్చే ఆ సూరీడు సాక్షిగా
నువ్వుంటే చాలు నా జతగా
ప్రతీ జన్మలో ఇలా ఇంతే ప్రేమగా నాకు భార్యగా
మిగతావాన్ని నాకొదిలేయ్
నాతో కలిసి అడుగై
బ్రతుకంతా నీకు తోడుంటా
కంటిపాపలా నిన్ను కాపాడుకుంటా
Please check out my YouTube channel:
www.youtube.com/c/NS360