నవీన కవిత

చెలిమి


Listen Later

చూస్తుండగానే గడిచి పోయింది కాలం

బాల్యానికి దూరంగా బ్రతుకు ప్రయాణం

ఆడిన ఆటలు పాడిన పాటలు

అల్లరి చేష్టలు ఆకతాయి పనులు

తిరిగిన వీధులు తరగతి గదులు

తిట్లు కొట్లాటలు అలకలు అపార్థాలు

తలుచుకుంటే అవి ఇప్పుడు మధురజ్ఞాపకాలు

ప్రతిరోజూ మేము మాట్లాడుకోము

ఎవరి పనిలో వారుంటాము

వీలు చూసుకుని కలుసుకుంటాము

యోగ క్షేమాలు తెలుసుకుంటాము

కబుర్లు చెప్పుకుంటాము

సరదాగా నవ్వుకుంటాము


ఎన్నేళ్ళు గడిచినా విడిపోని స్నేహితులం

మూలాలు మర్చిపోలేని మనుషులం మేం

మనం ఎదిగితే చూడాలి అనుకునే చాలా వారు అరుదు

అలాంటి వారు దొరికితే అస్సలు వదులుకోకూడదు


ఏదో కోరి చేసే స్నేహం నిలువదు ఎంతో కాలం

అవసరం తీరిందా అట్నుంచి అటే మాయం

నిజమైన స్నేహితుడు ఒకడుంటే చాలు

కసిరినా విసిరినా నిన్నొదిలిపోడు


చెలిమికి వయసుతో పని లేదు

నీ పొరుగు వారు నీతో పనిచేసేవారు

వారు ఎవరైనా ఎపుడైనా ఎక్కడైనా ఎలా అయినా

నీ మనసు తెలిసిన వారు నీకు దగ్గరవుతారు


Please check out my YouTube channel:

www.youtube.com/c/NS360

...more
View all episodesView all episodes
Download on the App Store

నవీన కవితBy Naveen Chenna