బ్రిటీష్ పాలకులు ఎంత దుర్మార్గంగా వ్యవహరించేవారో మనకు బాగా తెలుసు. మన దేశాన్ని దోచుకున్నారు.. మన సంస్కృతిని నాశనం చేశారు. మన వాళ్లను నానా విధాలుగా హింసించారు. ప్రస్తుతం బ్రిటన్ భాగమైన.. ఇంగ్లండ్‌కు పక్కనే ఉన్న స్కాట్లాండ్ వాసులదీ ఒకప్పుడు మనలాంటి పరిస్థితే. ఆ స్కాంట్లాండ్‌కు ఇంగ్లండ్ నుంచి విముక్తి కలిగించిన రాజు 8వ రాబర్ట్ ది బ్రూస్. కానీ ఇంగ్లండ్ రాజు కబంధ హస్తాల నుంచి స్కాట్లాండ్‌ను విడిపించడానికి బ్రూస్‌ను ప్రయత్నించడం వెనుక ఓ ఆసక్తి కరమైన కథ ఉంది. అదే మన స్టోరీ..