మనమందరం
వివిధ అంశాల ఆధారంగా మన కోసం, మన కుటుంబం, సమాజం కోసం అనేక నిర్ణయాలు తీసుకుంటాము. ఈ నిర్ణయ సామర్థ్యాన్ని తదుపరి
స్థాయికి తీసుకువెళ్లమని చెబుతూ, 'యోగః కర్మసు కౌశలం',
అంటే యోగస్థితిలో చేసే ప్రతి కర్మా సామరస్యంగా ఉంటుందని శ్రీ
కృష్ణుడు ఉద్బోధించారు (2.50). ఇది పువ్వు నుండి ప్రవహించే
అందం, సువాసన వంటి సామరస్యాన్ని అనుభవించడానికి
కర్తృత్వాన్ని, అహంకారాన్ని వదిలివేయడం.
మనం, మన కుటుంబం, సుఖాన్ని పొందడం లేక బాధను నివారించడం కోసం
ఒక కర్తలాగా మన నిర్ణయాలన్నీ తీసుకుంటాము. ప్రయాణం యొక్క తదుపరి స్థాయి సమతుల్య
నిర్ణయాలు తీసుకోవడం, ప్రత్యేకించి మనం సంస్థలకు, సమాజానికి బాధ్యత వహిస్తున్నప్పుడు, అయినా కర్తృత్వం
ఇంకా మిగిలి ఉంటుంది.
ఇక్కడ, శ్రీకృష్ణుడు కర్తృత్వానికి తావులేని అంతిమ స్థాయి గురించి
మాట్లాడుతున్నారు. అటువంటి స్థాయికి చేరిన వ్యక్తి ఏది చేసినా అది సామరస్యంగా
ఉంటుంది. అంతటా వ్యాపించిన చైతన్యమే వారికి కర్త గా మారుతుంది.
ఈ
దశ నిర్ణయాధికారులందరికీ ప్రయాణంలో ఒక ముఖ్యమైన భాగం, కనుకనే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS - భారతీయ
పరిపాలనా సేవ) ని 'యోగః కర్మసు కౌశలమ్' నీతి వాక్యముగా స్వీకరించేలా ప్రేరేపించింది.
ఇది
భావోద్వేగాలు, పక్షపాతాలు, జ్ఞాపకాల ప్రభావంలో
పడకుండా ఉండడం; వాటి ప్రభావములో పడితే ఇవి వాస్తవాలను
గ్రహించే మన సామర్థ్యాన్ని నాశనము చేస్తాయి, తప్పుడు
నిర్ణయాలకు దారితీస్తాయి. ఇది ప్రధానంగా మానవ చర్యల నుండి ఉత్పన్నమయ్యే ధ్రువాల
బారిన పడినప్పుడు ఎంత త్వరగా తట్టఫదశలోకి రావాల్సిన అవసరముందో అన్ని చెప్పే అంశం.
చట్టాన్ని
అమలు చేయడం లేదా ఏదైనా నిర్ణయం తీసుకోవడం ఎల్లప్పుడూ ఆహ్లాదకరంగా ఉండే విషయం కాదు.
తటస్థంగా ఉండటం వల్ల ప్రశంసలు, విమర్శలను సమంగా గ్రహించడంలో
మనకు సహాయపడుతుంది.
తటస్థ
స్థితిలో దృఢంగా ఉన్న వారందరికీ శక్తి, అపరిమిత తెలివి తేటలు,
కరుణ అందుబాటులో ఉంటాయి. అటువంటి వనరులు అందుబాటులో ఉంటే భౌతిక
ప్రపంచ దృక్కోణం నుండి కూడా అన్నింటా కార్యసాధకులవుతారు. సూర్యుడికి చాలా దగ్గరగానూ
లేక చాలా దూరంగానూ లేక భూమి తటస్థంగా ఉండటం వల్లనే ఈ జీవనం సాధ్యమవుతుంది.
ఎందుకంటే జీవాన్ని ఇచ్చే నీరు ద్రవ రూపంలో ఉండడానికి ఈ తటస్థత దోహదపడుతోంది.