నవీన కవిత

ఇంతేనోయ్ జీవితం


Listen Later

నచ్చిందేదో చేస్తూ పోవటం

వచ్చిందేదో స్వీకరించటం

నీతో వచ్చిన వాళ్లకి తలా ఇంతా పంచటం

ఉన్నంతలో సంతోషంగా బ్రతికేయటం


రోజూ ఏదో ప్రయత్నించటం

ఏదేమైనా ఎదుర్కోవటం

బాధను భారంగా భావించకపోవటం

నీ బ్రతుకులో అది ఒక భాగమని అంగీకరించటం

ఇప్పుడు నువ్వున్న స్థితినుండి

ఇంకొంత ఉన్నతంగా మారేందుకు ఉపయోగపడే మార్గం


భయాలు ఉన్నా ముందడుగు వేయటం

భరోసా లేకున్నా అనుకున్నది చేయటం

బంధాలలో బందీగా మారకపోవటం

ఇదే కదా వీరుల లక్షణం


ఏం చేస్తున్నావో అర్థం కాకపోవటం

ఎంత చేసినా ఇంతేలే అనే నిరాశలో కూరుకుపోవటం

నీకు నువ్వే నచ్చక పోవటం

రాజీ పడుతూ రోజులు గడిపేసే వైనం


ఉన్నంతలో సంతోషంగా బ్రతకాలా

ఉన్నతంగా మారేందుకు ప్రయత్నించాలా

ఉన్న పనులన్నీ మానుకుని నమ్మిన దానికోసం తెగించాలా

ఉన్న అవకాశాన్ని వృథా చేస్తూ బ్రతుకుని నిందించాలా

ఇవి నాలుగు దారులు

నీ బ్రతుకుని మలుపు తిప్పే మార్గాలు

ఇది నీ యుద్ధం, ఇక నీ ఇష్టం.

...more
View all episodesView all episodes
Download on the App Store

నవీన కవితBy Naveen Chenna