ఝుం అని శబ్దం చేయడం, పట్టుకోవడం
తొమ్మిది నెలలు మీలో భాగంగా ఉన్న మీ బిడ్డ ఈ భూమిపైకి వచ్చిన తర్వాత మీకు దూరంగా ఉండేందుకు సమయం పడుతుంది. పుట్టిన మొదటి మూడు నెలలు మీ స్పర్శ అనేది బిడ్డకు చాలా ముఖ్యం. నిద్రించే సమయంలో తప్ప మిగిలిన అన్ని సమయాల్లో మీ సాన్నిహిత్యాన్ని బిడ్డ కోరుకుంటాడు. మీ స్పర్శ లేదా గొంతు వినడం అన్నవి అతడికి ముఖ్యం. అందుకే, మీ బిడ్డను మీ ఛాతీ లేదా మెడ చర్మం ఫీలయ్యేలా దగ్గరగా పెట్టుకొని, ఎత్తుకోండి. బిడ్డ మీ శరీర పరిమళాన్ని ఆస్వాదించడానికి, స్పర్శను అనుభవించడానికి ఇష్టపడతాడు. మీరు నడుస్తున్నా, లేదా బిడ్డను వళ్ళో వేసుకుని ఊపుతున్నా లేదా విశ్రాంతిగా ఉన్నా, జోలపాట పాడటం కానీ ఏదైనా పాటను హమ్ చేయడం కానీ చేయండి. సున్నితమైన మీ పాటను మీ బిడ్డ వినడమే కాదు అనుభూతిస్తాడు.
Carengrow matter