Sign up to save your podcasts
Or

జోగిని - Skitఉపోద్ఘాతం - క్రీ.శ. 10వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య కాలంలో దేవాలయాల్లో, దైవ సన్నిధిలో నాట్యనివేదనకై నియమింపబడిన దేవుని దాసులే దక్షిణ భారత దేశంలో దేవదాసిలై, తెలుగు రాష్ర్టాలలో జోగినిలై, కేరళలో మాతంగిలై, అభం శుభం ఎరుగని అయిదేళ్ల వయసులో జీవితాన్ని దైవసన్నిధిలో, దైవం ముసుగులో ఎన్నో అరాచకాలకు బలైపోయాయి పసిప్రాయాలు. ఇది కేవలం భారత దేశంలోనే కాదు మన పొరుగు దేశాలైన శ్రీలంక, బాంగ్లాదేశ్, పాకిస్థాన్ లోనూ, మలేషియా, థాయిలాండ్ లోనూ, ఇండోనేషియా లో దేవీ-దేవీ అని, కాంబోడియా లో అప్సరసలని, నేపాల్ లో దేవికి లేని, చైనా మరియు రోమ్ లో ఆలయ వేశ్యలని, ఆఫ్రికా లో ట్రొపీజెన్నాస్ అని, జపాన్ లో గెయిషా లని, కొరియా లొ కిసాంగ్ అని, గ్రీస్ లో హిరోడల్సని పిలువబడే ఈ దురాచారాలు ఎన్నో ఏళ్లుగా ఎందరో పసిపాపలు, మరెందరో యువతులు, ఇంకెందరో మహిళలు తరతరాలుగా తమ మానప్రాణాలను కోల్పోయారు. ఇప్పటికీ కోల్పోతున్నారు. అటువంటి ఓ చిన్నారి చిన్ని కథే మా యీ జోగిని. ఇది ఎవరినీ ఉద్దేశించి రాసినది కాదు. చరిత్ర పుటల్లో నుంచి పుట్టుకొచ్చిన బాధల వ్యధలే మా యీ గాథ. ఇది ఎవరి మనస్సునైనా నొప్పించినట్లున్ననూ, ఎవరి జీవితానికైనా దగ్గరగా ఉన్నట్లున్ననూ సాదరాభిమానంతో మన్నించి మా యీ చిన్న ప్రయత్నానికి ప్రోత్సాహాన్నిస్తారని ఆశిస్తూ......
నాటక సమయం - అయిదు నిమిషాలు
పాత్రలు - అమ్మ, అయ్య, చిన్ని, మల్లి, విజయ్, స్వామి
స్టేజి - ఎడమ వైపు చిన్ని ఇల్లు, అయ్య బుట్టలు అల్లడం, అమ్మ ఇంటి పని చేయడం, చిన్ని జామకాయలు కోయడం. మధ్యలో గుడి, గుడి లో సామి పూజలు చేయడం, బయట కాళ్లు లేని మల్లిగాడు డోలు వాయించడం. కుడివైపు గ్రామం పొలిమేరల్లో డాక్టర్ విజయ్ రావడం
ఎముకలు వంగిన ముతకల్లారా చావండి
రక్తం మరిగే యువకుల్లారా లేవండి
పదండి ముందుకు పదండి దూసుకు పదండి పోదాం పైపైకి
మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది
ఈ పాపకి ఏం కాలేదు. భయంతో జ్వరం వచ్చింది. ఈ మందులేస్తే సరిపోతుంది. ఇప్పటికైనా మీ మూఢనమ్మకాలు వదిలి మనిషిని మనిషిలా ప్రేమించడం. ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం నేర్చుకోండి.
By Manikanta Kamatam Gurukulam Acharya జోగిని - Skitఉపోద్ఘాతం - క్రీ.శ. 10వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య కాలంలో దేవాలయాల్లో, దైవ సన్నిధిలో నాట్యనివేదనకై నియమింపబడిన దేవుని దాసులే దక్షిణ భారత దేశంలో దేవదాసిలై, తెలుగు రాష్ర్టాలలో జోగినిలై, కేరళలో మాతంగిలై, అభం శుభం ఎరుగని అయిదేళ్ల వయసులో జీవితాన్ని దైవసన్నిధిలో, దైవం ముసుగులో ఎన్నో అరాచకాలకు బలైపోయాయి పసిప్రాయాలు. ఇది కేవలం భారత దేశంలోనే కాదు మన పొరుగు దేశాలైన శ్రీలంక, బాంగ్లాదేశ్, పాకిస్థాన్ లోనూ, మలేషియా, థాయిలాండ్ లోనూ, ఇండోనేషియా లో దేవీ-దేవీ అని, కాంబోడియా లో అప్సరసలని, నేపాల్ లో దేవికి లేని, చైనా మరియు రోమ్ లో ఆలయ వేశ్యలని, ఆఫ్రికా లో ట్రొపీజెన్నాస్ అని, జపాన్ లో గెయిషా లని, కొరియా లొ కిసాంగ్ అని, గ్రీస్ లో హిరోడల్సని పిలువబడే ఈ దురాచారాలు ఎన్నో ఏళ్లుగా ఎందరో పసిపాపలు, మరెందరో యువతులు, ఇంకెందరో మహిళలు తరతరాలుగా తమ మానప్రాణాలను కోల్పోయారు. ఇప్పటికీ కోల్పోతున్నారు. అటువంటి ఓ చిన్నారి చిన్ని కథే మా యీ జోగిని. ఇది ఎవరినీ ఉద్దేశించి రాసినది కాదు. చరిత్ర పుటల్లో నుంచి పుట్టుకొచ్చిన బాధల వ్యధలే మా యీ గాథ. ఇది ఎవరి మనస్సునైనా నొప్పించినట్లున్ననూ, ఎవరి జీవితానికైనా దగ్గరగా ఉన్నట్లున్ననూ సాదరాభిమానంతో మన్నించి మా యీ చిన్న ప్రయత్నానికి ప్రోత్సాహాన్నిస్తారని ఆశిస్తూ......