నీ ఊహలే
ఏవో ఆశలే.. ..
నాలో నిండేనే..
ఎద.. గిలిగింతల్లో..ఏదేదో ఆయేనే..
కొత్తగా ఉంది ఈ వేళ.. నీ జ్ఞాపకాలు మనసును అల్లేస్తుంటే..
చలిగా ఉంది నా మేని..నీ ప్రతి గురుతు వింతగా కమ్మేస్తుంటే..
ఏం చేస్తున్నానో.. నాకే తెలియరాకుందే..
ఈడు గోల ఆపడం నాతరం కాకుందే..
వీచే ప్రతి గాలి..నీ పరిమళమై పరవశం గావిస్తుంటే..
ఆ తలంపుకే గుండె లయ తప్పి నీ వశం అవుతుంటే..
ఎలా ఉన్నానో .ఏమో,ఇదేం లోకమో..
నీతో ఉన్నానో..ఏమో..నీ మైకమో..
6/1/2009