నవీన కవిత

మూర్ఖ


Listen Later

అమావాస్య రోజున వెన్నెల కోసం ఎదురుచూసేవు

కాల రాత్రిలో జాబిలి తోడు కోరేవు

చుక్కలెన్ని ఉన్నా చాలవా నీకు??

హద్దులన్నవి లేవు నీ కోరికలకు

నడి ఎడారిలో నీవు నదుల జాడలు వెతికేవు

మండుటెండలో సైతం నీ నడకను ఆపవు

ఒయాసిస్సులో నీరు సరిపోదా నీకు?

ఎండమావుల వెనక ఎందుకు పరిగెడతావు??


ముసురుకమ్మినవేళ ముడుచుకొని పడుకుంటావు

గ్రహణమేమో అని నీ గది దాటి బయటకి రావు

తొలకరి చినుకలకి పరవశించి ఆడేను నెమలి

వరదొస్తే బురదవుతుందనే నిన్ను ఏమనాలి?


మోడుబారిన మాను కింద నీడలేదని వగచేవు

రాలిపోయిన ఆకులన్ని ఏరి అతికిస్తానంటావు

ఎన్ని శిశిరాలు,వసంతాలు దాటితే నువ్వు ఇంతదూరం వచ్చావు?

ప్రకృతి నియమాలు మరిచి ఏమిటీ పిల్ల చేష్టలు??


వయసు పెరిగే కొద్దీ మళ్లీ మొదటికే వస్తావు

కాలంతో పాటే నేర్చుకో కొన్ని పాఠాలు

ఆశ నిరాశల మధ్య ఊగిసలాడే బ్రతుకు నీది

కాస్త సాధ్యాసాధ్యాలను కూడా ఆలోచిస్తే మంచిది


Please check out my YouTube channel:

www.youtube.com/c/NS360

...more
View all episodesView all episodes
Download on the App Store

నవీన కవితBy Naveen Chenna