
Sign up to save your podcasts
Or


కొన్ని నిజాలు నీటిలోని చేపలు
మనోసంద్రాన మాత్రమే మనగలవు
బయటికొస్తే బ్రతకలేవు
కొన్ని అభిప్రాయాలు మూగ జీవులు
ఎంత అరిచినా ఎవ్వరూ పట్టించుకోరు
వెల్లడించని మాటలు వ్యక్తపరచని భావాలు
మనసుని స్థిరంగా ఉండనీయవు
కాలిలో ముల్లులా కంటిలో నలుసులా
అంత సులువుగా బయటికి రావు
నవ్వుతూ మాట్లాడే వారందరూ నీ వారు కాదు
నీకు తెలిసిన వారిలో సగం మంది మహానటులు
నిన్ను తనలా ఎప్పటికీ భావించరు
వింటున్నారు కదా అని చెప్పకు నీ బాధలు
ప్రతీ మనిషిలో కొన్ని చీకటి కోణాలు
తెలివి తక్కువ వాళ్లు బయటపడతారు
తెలుసుకున్న వాళ్లు వెలుగువైపు నడుస్తారు
తెలివైన వాళ్లు తప్పించుకు తిరుగుతారు
మహముదుర్లు కొందరు మహానుభావులు
ముంచుతూ కూడా మంచివారిగా చలామణి కాగల సమర్థులు
పరులకు నువ్వెలా పనికొస్తావు?? అదే నీ విలువ!!అడగకుండా సలహాలిచ్చేవాడు ఎదుటివాడికి లోకువ
అనుభవం ద్వారా తెలియవచ్చేదే అసలైన సత్యం
నేను చెప్పేది నీకు నచ్చితే నిజం లేకపోతే వేదాంతం
Please check out my YouTube channel:
www.youtube.com/c/NS360
By Naveen Chennaకొన్ని నిజాలు నీటిలోని చేపలు
మనోసంద్రాన మాత్రమే మనగలవు
బయటికొస్తే బ్రతకలేవు
కొన్ని అభిప్రాయాలు మూగ జీవులు
ఎంత అరిచినా ఎవ్వరూ పట్టించుకోరు
వెల్లడించని మాటలు వ్యక్తపరచని భావాలు
మనసుని స్థిరంగా ఉండనీయవు
కాలిలో ముల్లులా కంటిలో నలుసులా
అంత సులువుగా బయటికి రావు
నవ్వుతూ మాట్లాడే వారందరూ నీ వారు కాదు
నీకు తెలిసిన వారిలో సగం మంది మహానటులు
నిన్ను తనలా ఎప్పటికీ భావించరు
వింటున్నారు కదా అని చెప్పకు నీ బాధలు
ప్రతీ మనిషిలో కొన్ని చీకటి కోణాలు
తెలివి తక్కువ వాళ్లు బయటపడతారు
తెలుసుకున్న వాళ్లు వెలుగువైపు నడుస్తారు
తెలివైన వాళ్లు తప్పించుకు తిరుగుతారు
మహముదుర్లు కొందరు మహానుభావులు
ముంచుతూ కూడా మంచివారిగా చలామణి కాగల సమర్థులు
పరులకు నువ్వెలా పనికొస్తావు?? అదే నీ విలువ!!అడగకుండా సలహాలిచ్చేవాడు ఎదుటివాడికి లోకువ
అనుభవం ద్వారా తెలియవచ్చేదే అసలైన సత్యం
నేను చెప్పేది నీకు నచ్చితే నిజం లేకపోతే వేదాంతం
Please check out my YouTube channel:
www.youtube.com/c/NS360