Srini's EDU Podcast

Sathaka Madhurima 3 | శతక మధురిమ 3 | 10th Class Telugu | Season 4 | Episode 38 | Srini's EDU Podcast


Listen Later

Andhra Pradesh 10th Class Telugu 6th Lesson Shataka Madhurima


In this episode we will cover the Telugu poem (Telugu padyam) written by the Tharigonga Vengamamba "Pattuga Neeshvarundu


పట్టుగ నీశ్వరుండు తన పాలిట నుండిపుడిచ్చినంతలో

దిట్టక దీనాదేహులను దేటగ లాలనజేసి, యన్నమున్

బెట్టు వివేకి మానసము బెంపొనరించుచు నూరకుండినన్

గుట్టుగ లక్షిబొందు; దరిగొండనృసింహ! దయాపయోనిధీ!

తరిగొండ వెంగమాంబ


పదవిభాగం: 

పట్టుగన్, ఈశ్వరుండు, తన పాలిటన్, ఉండి, ఇపుడు, ఇచ్చినంతలోన్, 

తిట్టక, దీనాదేహులను, తేటగ, లాలనన్ + చేసి, అన్నమున్, 

పెట్టు, వివేకి, మానసమున్, పెంపు + ఒనరించుచున్, ఊరక + ఉండినన్, 

గుట్టుగన్, లక్ష్మిన్, పొందున్, తరిగొండనృసింహ, దయాపయోనిధీ.


ప్రతిపదార్ధము:

దయాపయోనిధీ = దయకు సముద్రుడువైన వాడా (సముద్రమంత గొప్ప దయ కలిగిన వాడా)

తరిగొండనృసింహ = తరిగొండ గ్రామంలో వెలసిన ఓ నృసింహస్వామి

ఈశ్వరుండు = భగవంతుడు

పట్టుగన్ = దృఢంగా

తన పాలిటన్ = తన పక్షమున

ఉండి = నిలిచి

ఇపుడు = ఈ జన్మలో

ఇచ్చినంతలోన్ = ప్రసాదించిన దానిలోనే

తిట్టక = నిందించకుండా

దీనాదేహులను = నిరుపేదలను

తేటగ = ఆప్యాయంగా

లాలనన్ + చేసి = బుజ్జగించి

అన్నమున్ = అన్నమును

పెట్టు = పెట్టునటువంటి

వివేకి = వివేకవంతుడు

మానసమున్ = తన యొక్క మనసును

పెంపు + ఒనరించుచున్ = ఆనందింపచేసుకుంటూ

ఊరక + ఉండినన్ = అడగకుండా ఊరక ఉన్నప్పటికీ

గుట్టుగన్ = రహస్యముగా

లక్ష్మిన్ = ఐశ్వర్యమును

పొందున్ = పొందుతాడు


భావం: దయాసముద్రుడా! తరిగొండనృసింహదేవా! వివేకి అయినవాడు తనకు భగవంతుడు ప్రసాదించిన దానిలో - అనాథలను, నిరుపేదలను కసరుకోక ఆప్యాయతతో లాలిస్తూ అన్నం పెడతాడు. అలాంటి సహృదయుణ్ణి సంపదలకు అధిదేవత అయిన లక్ష్మి గుట్టుచప్పుడు కాకుండా వచ్చి వరిస్తుంది. దీనులకు చేసే అన్నదానానికి ఇంతటి ప్రాశస్త్యం ఉందని తాత్పర్యం.

---
Send in a voice message: https://anchor.fm/srinivas-nissankula/message
...more
View all episodesView all episodes
Download on the App Store

Srini's EDU PodcastBy Srinivas Nissankula