Share Srini's EDU Podcast
Share to email
Share to Facebook
Share to X
Andhra Pradesh 10th Class Telugu 4th Lesson Vennela (వెన్నెల)
In this episode we will cover the Telugu poem (Telugu padyam) written by the Errana "Suruchira Taarakaakusumashobhi" (సురుచిర తారకాకుసుమశోభి)
సురుచిర తారకాకుసుమశోభి నభోంగణభూమిఁ గాలమ
న్గరువపుసూత్రధారి జతనంబున దిక్పతికోటి ముందటన్
సరసముగా నటింపఁగ నిశాసతి కెత్తిన క్రొత్తతోఁపుఁబెం
దెర యన నొప్పె సాంధ్యనవదీధితి పశ్చిమదిక్తటంబునన్.
పదవిభాగం:
సురుచిర, తారకాకుసుమ, శోభి, నభః + అంగణభూమిన్, కాలమన్,
గరువపు సూత్రధారి, జతనంబున, దిక్పతికోటి, ముందటన్,
సరసముగా, నటింపగ, నిశాసతికిన్, ఎత్తిన, క్రొత్త, తోపు,
పెందర, అనన్, ఒప్పెన్, సాంధ్య, నవదీధితి, పశ్చిమదిక్ + తటంబునన్.
ప్రతిపదార్ధము:
సురుచిర= బాగా అందంగా ప్రకాశిస్తున్న
తారకాకుసుమ= నక్షత్రాలనే పూల చేత
శోభి= అలంకరింపబడిన
నభః+ అంగణభూమిన్ = ఆకాశమనే రంగస్థలంపై
కాలమన్= కాలమనే
గరువపు సూత్రధారి = గొప్ప దర్శకుని యొక్క
జతనంబున= ప్రయత్నం చేత
దిక్పతికోటి= దిక్పాలకుల సమూహము
ముందటన్= ముందు
సరసముగా= చక్కగా
నటింపగ= నాట్యం చేయడానికి సిద్ధపడిన
నిశాసతికిన్= రాత్రి అనే స్త్రీకి (అడ్డముగా)
ఎత్తిన= నిలిపిన
క్రొత్త= క్రొత్తదైనా
తోపు= లేత ఎర్రని రంగుగల
పెందర= పెద్ద తెర ఏమో
అనన్= అన్నట్లుగా
పశ్చిమదిక్+ తటంబునన్ = పడమటి తీరంలోని
సాంధ్య= సాయం సంధ్యా కాలం
నవదీధితి= కొత్త వెలుగుతో
ఒప్పెన్= ప్రకాశించినది.
భావం:
బాగా అందంగా ప్రకాశిస్తున్న నక్షత్రాలనే పూల చేత అలంకరింపబడిన ఆకాశమనే రంగస్థలంపై కాలమనే గొప్ప దర్శకుని యొక్క ప్రయత్నం చేత దిక్పాలకుల సమూహము ముందు చక్కగా నాట్యం చేయడానికి సిద్ధపడిన రాత్రి అనే స్త్రీకి అడ్డముగా నిలిపిన క్రొత్తదైనా లేత ఎర్రని రంగుగల పెద్ద తెర ఏమో అన్నట్లుగా పడమటి తీరంలోని సాయం సంధ్యా కాలం కొత్త వెలుగుతో ప్రకాశించినది. (పూర్వం నాటక ప్రదర్శనల్లో ముందు సూత్రధారి ప్రవేశించేవాడు. తర్వాత తెరచాటునుండి నటి ప్రవేశించేది. ఆ సంప్రదాయాన్ని కవి ఇక్కడ చక్కగా ఆవిష్కరించాడు.)
Andhra Pradesh 10th Class Telugu 4th Lesson Vennela (వెన్నెల)
In this episode we will cover the Telugu poem (Telugu padyam) written by the Errana "Inu nasamaanateju" (ఇను నసమానతేజు)
ఇను నసమానతేజు దివసేంద్రుఁ గనుంగొనుమాడ్కిఁ జూడఁగాఁ
జన దొరు నల్పతేజు నను చాడ్పునఁ జంచలభృంగతారకా
ఘన వనజాతాలోచనము గ్రక్కున మీలన మొందఁజేసెఁ బ
ద్మిని పతిభక్తి సత్వమున మేలిమికిం గుఱి దానపొమ్మనన్.
భావం:
సాటిలేని కాంతితో ప్రకాశిస్తున్న సూర్యుడిని చూసినట్లుగా తక్కువ కాంతితో ప్రకాశించేవారిని చూడడం తగదు అనుకున్నది పద్మిని. అందుచేత కదులుతున్న తుమ్మెద అనెడు కనుగ్రుడ్డుగల పద్మము అనే కంటిని వెంటనే మూసుకున్నది. ఇది పతిభక్తిలో తామరతీగ తనకు తానే సాటి అన్నట్లున్నది.
సూర్యుని కిరణాలతో పద్మాలు విచ్చుకుంటాయి. సూర్యుణ్ణి కమలప్రియుడు, కమలబాంధవుడు అని అంటారు. పద్మినికి, సూర్యునికి మధ్య గల సంబంధాన్ని భార్యాభర్తల అనుబంధంగా ఎఱ్ఱన చిత్రించాడు.
Andhra Pradesh 10th Class Telugu 4th Lesson Vennela (వెన్నెల)
చదవండి - ఆలోచించి చెప్పండి.
ఈ కవిత చదవండి
కొండకోనల్లో
నవ్వుతూ, తుళ్ళుతూ పరుగెడుతున్న
సెలయేరు
కాలుజారి లోయలో పడిపోయింది.
అదిచూసి
ఆకులు చాటుచేసుకొని,
మొగ్గలు బుగ్గలు నొక్కుకున్నాయి.
ఇదంతా చూస్తున్న సూరీడు
పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ
పడమటి కొండల వెనక్కి
పడిపోయాడు.
1. ఈ కవిత దేన్ని వర్ణిస్తున్నది?
జ. ఈ కవిత సూర్యాస్తమయం గురించి వర్ణిస్తున్నది.
2. సూరీడు పడమటి కొండల వెనక్కి పడిపోవడమంటే ఏమిటి?
జ. సూర్యాస్తమయం అవ్వడంని కవి సూరీడు పడమటి కొండల వెనక్కి పడిపోవడం అని వర్ణించాడు.
3. సెలయేరు కొండాకోనల మీద నవ్వుతూ తుళ్ళుతూ పరుగెత్తడం అంటే మీకేమని అర్ధమయ్యింది?
జ. కొండల మీద సెలయేరు జల జల శబ్దంచేసుకుంటూ పారుతూ ఉంటుంది దీనిని కవి నవ్వుతూ తుళ్ళుతూ పరుగెత్తడం అని అర్ధమయ్యింది.
నేపథ్యం:
హిరణ్యకశిపుడు వనవిహారం చేసిన సందర్భంలో వసంత ఋతువును, సాయం సమయాన్ని, చంద్రోదయాన్ని కవి వర్ణించాడు. రోజంతా తీవ్రమైన ఎండను ప్రసరింపజేసిన సూర్యుడు, ఇంకా ఉష్ణతాపాన్ని పెంచితే అసురనాయకుడైన హిరణ్యకశిపుడు సహింపడేమో అన్నట్లు నెమ్మదిగా పక్కకు తొలిగి పోయాడు. తదనంతరం ప్రకృతిలో వచ్చిన మార్పులను రమణీయంగా వర్ణించారు.
మరియు కవి పరిచయం ఈ పాఠం కవి ఎఱ్ఱాప్రగడ (ఎఱ్ఱన)
ఈ పాఠంలో నృసింహ పురాణంలోనిది ఇందులో కవి చందమామ వెలుగైన - వెన్నెలను ఎంతో రమణీయంగా వర్ణించాడు.
Andhra Pradesh 10th Class Telugu 6th Lesson Shataka Madhurima
In this episode we will cover the Telugu poem (Telugu padyam) written by the dhurjati "Jatulsepputa Sevacheyuta " and Baddena "Varadaina Chenu Dunnaku"
జాతుల్సెప్పుట, సేవచేయుట, మృషల్ సంధించుట న్యాయాప
ఖ్యాతింబొందుట, కొండెగాడవుట, హింసారంభకుండౌట, మి
ధ్యాతాత్పర్యము లాడు టన్నియుఁ బరద్రవ్యంబు నాశించి, యా
శ్రీ తా నెన్ని యుగంబులుండఁగలదో శ్రీకాళహస్తీశ్వరా!
- ధూర్జటి
పదవిభాగం:
జాతుల్+చెప్పుట, సేవచేయుట, మృషల్ సంధించుట,
న్యాయ+అపఖ్యాతి+పొందుట, కొండెగాడు+అవుట, హింస+ఆరంభకుండు+అవుట,
మిధ్యాతాత్పర్యములు+ఆడుట, అన్నియున్, పరద్రవ్యంబు, ఆశించి,
ఆ శ్రీ, తాను, ఎన్నియుగంబులు, ఉండగలదో, శ్రీకాళహస్తీశ్వరా!
ప్రతిపదార్ధము:
శ్రీకాళహస్తీశ్వరా! = శ్రీకాళహస్తిలో వెలసిన ఓ పరమేశ్వరా
జాతుల్+చెప్పుట = జాతకాలు చెప్పుట
సేవచేయుట = రాజులకు సేవ చేయటం
మృషల్ సంధించుట = అబద్దాలు కల్పించడం
న్యాయ+అపఖ్యాతి+పొందుట = అన్యాయ ప్రవర్తన ద్వారా చెడ్డపేరు పొందడం
కొండెగాడు+అవుట = చాడీలు చెప్పడం
హింస+ఆరంభకుండు+అవుట = హింసలు చేయడం
మిధ్యాతాత్పర్యములు+ఆడుట = ఉన్నవీ, లేనివీ చెప్పడం
అన్నియున్ = ఇటువంటి పనులన్నియు
పరద్రవ్యంబు = ఇతరుల ధనమును
ఆశించి (యేకదా) = కోరి చేయినట్టివే కదా
ఆ శ్రీ = అలా సంపాదించినా ధనము
తాను = తాను
ఎన్నియుగంబులు = ఎన్ని యుగాలపాటు
ఉండగలదో = ఉంటుందో కదా
భావం:
శ్రీకాళహస్తీశ్వరా! జనులు ధనాన్ని కోరి జాతకాలు చెప్పడం, రాజుల సేవలు చేయడం, అబద్దాలు కల్పించడం, ధర్మాన్ని తప్పడం, చాడీలు చెప్పడం, హింసలు చేయడం, ఉన్నవీ, లేనివీ పలకడం - ఇన్ని పనులు చేస్తున్నారు. ఇవి అన్నీ ఇతరుల ధనాన్ని ఆశించి చేసేవే? ఆ ద్రవ్యమెన్నాళ్ళుంటుంది? తాను మాత్రం యుగాలపాటు ఉండడుగదా. అందుచేత ఈ చెడుపనులన్నీ నిరర్ధకాలు.
వఱదైన చేను దున్నకు
కరవైనను బంధుజనుల కడ కేఁగకుమీ
పరులకు మర్మము సెప్పకు
పిఱికికి దళవాయితనముఁ బెట్టకు సుమతీ!
- బద్దెన
భావం:
సుమతీ! వరద వస్తే మునిగిపోయిన పొలాన్ని దున్నవద్దు. కరువు వస్తే బంధువుల ఇండ్లకు వెళ్ళద్దు. తన రహస్యాన్ని పరాయివారికి, అంటే శత్రువులకు, చెప్పవద్దు. పిరికివానికి సేవనాయకత్వం ఇవ్వవద్దు.
Andhra Pradesh 10th Class Telugu 6th Lesson Shataka Madhurima
In this episode we will cover the Telugu poem (Telugu padyam) written by the Kancherla Gopanna "Chikkani Palapai Misimi Jendina Meegada"
చిక్కనిపాలపై మిసిమి జెందిన మీగడ పంచదారతో
మెక్కినభంగి నీ విమల మేచకరూప సుధారసంబు నా
మక్కువ పళ్ళెరంబున సమాహిత దాస్యమనేటి దోయిటన్
దక్కె నటంచు జుఱ్ఱెదను దాశరథీ కరుణాపయోనిధీ!
- కంచెర్ల గోపన్న
పదవిభాగం:
చిక్కనిపాలపై, మిసిమిన్+చెందిన, మీగడన్, పంచదారతో,
మెక్కిన భంగిన్, నీ విమల, మేచకరూప, సుధారసంబు,
నా మక్కువ, పళ్ళెరంబున, సమాహిత దాస్యము+అనేటి, దోయిటన్,
దక్కేను+అటంచున్, జుఱ్ఱెదను, దాశరథీ, కరుణాపయోనిధీ!.
ప్రతిపదార్ధము:
కరుణాపయోనిధీ! = కరుణకు సముద్రమువంటి వాడా
దాశరథీ = దశరథుని కుమారుడవైన ఓ శ్రీరామా
చిక్కనిపాలపై = చిక్కని పాల మీద
మిసిమిన్+చెందిన = మిసమిసలాడుతున్న
మీగడన్ = మీగడను
పంచదారతో = పంచదారతో కలిపి
మెక్కిన భంగిన్ = తిన్నవిధముగా
నీ విమల = నీ యొక్క నిర్మలమైన
మేచకరూప = నల్లని ఆకారమనే
సుధారసంబు = అమృత రసమును
నా మక్కువ = నా యొక్క ప్రేమ అనే
పళ్ళెరంబున = పళ్లెంలో ఉంచి
సమాహిత దాస్యము+అనేటి = శ్రద్ధతో కూడిన సేవ అనెడి
దోయిటన్ = దోసిలియందు
దక్కేను+అటంచున్ = లభించింది అనుకుంటూ
జుఱ్ఱెదను = జుఱ్ఱుతూ త్రాగుతాను
భావం:
కరుణానిధివయిన దశరథరామా! చిక్కటి పాలమీద మిసమిసలాడే మీగడను పంచదారతో చేర్చి తిన్న విధంగా, నీ నీలమేఘచ్ఛాయతో కూడిన రూపమనే, అమృత రసాన్ని ప్రేమ అనే పళ్లెంలో ఉంచి, శ్రద్ధతో కూడిన సేవ అనే దోసిటిలోకి చేర్చుకొని ఇష్టంతో తింటాను.
Andhra Pradesh 10th Class Telugu 6th Lesson Shataka Madhurima
In this episode we will cover the Telugu poem (Telugu padyam) written by the Marada Venkaiah "Sthiratara Dharmavarthana"
స్థిరతర ధర్మవర్తన బ్రసిద్ధికి నెక్కినవాని నొక్కము
ష్క రు డతి నీచవాక్యముల గాదని పల్కిన నమ్మహాత్ముఁడుం
గొఱతవహింప డయ్యెడ, నకుంఠిత పూర్ణ సుధాపయోనిధిలో
నరుగుచు గాకి రెట్ట యిడి నందున నేమి కొఱంత భాస్కరా!
- మారద వెంకయ్య
పదవిభాగం:
స్థిరతర, ధర్మవర్తన, ప్రసిద్ధికిన్ + ఎక్కినవానిన్, ఒక్క ముష్కరుడు,
అతి నీచ వాక్యములన్, కాదు + అని, పల్కినన్, ఆ + మహాత్ముడున్,
కొఱత, వహింపడు, అయ్యెడన్, అకుంఠిత, పూర్ణ సుధాపయోనిధిలోన్,
అరుగుచున్, కాకి, రెట్ట, ఇడినందునన్, ఏమి కొఱంత, భాస్కరా!
ప్రతిపదార్ధము:
భాస్కరా! = ఓ సూర్యుడా
ఒక్క ముష్కరుడు = ఒక నీచుడు
స్థిరతర = మిక్కిలి స్థిరమైన
ధర్మవర్తన = ధర్మప్రవర్తన చేత
ప్రసిద్ధికిన్ + ఎక్కినవానిన్ = ప్రసిద్ధి పొందిన ఉత్తముడికి
అతి నీచ వాక్యములన్ = మిక్కిలి హీనమైన మాటలచే
కాదు + అని = నిందించి
పల్కినన్ = మాట్లాడినప్పటికీ
అమ్మహాత్ముడున్ = ఆ గొప్పవాడైన ఉత్తముడు
కొఱత = తక్కువదనంను
వహింపడు = పొందడు
(ఎట్లనినన్) = (అది ఎట్లాగంటే)
కాకి = కాకి
అరుగుచున్ = ఆకాశం నుండి ఎగిరి వెళుతూ
అకుంఠిత = అడ్డులేని
పూర్ణ సుధాపయోనిధిలోన్ = నిండిన అమృతసముద్రంలో
రెట్ట = మలము
ఇడినందునన్ = వేసినంతటి మాత్రం చేత
ఏమి కొఱంత = దాని గొప్పదనానికి ఏమి లోటు కలుగుతుంది.
భావం:
భాస్కరా! అమృత సముద్రము మీద కాకి ప్రయాణము చేస్తున్నప్పుడు, ఆ సముద్రంలో అది రెట్టవేసిననూ సముద్రానికి ఏలోటూ రాదు. ఎలాగంటే ధర్మావలంబి అయిన మానవుణ్ణి, ఒక నీచుడు చాలా హీనములైన మాటలచే నిందించినా ధర్మవర్తనునికి ఏమాత్రమూ లోపం రాదు.
Andhra Pradesh 10th Class Telugu 6th Lesson Shataka Madhurima
In this episode we will cover the Telugu poem (Telugu padyam) written by the Marada Venkaiah "Urugunavanthu Dodlu"
ఉరుగుణవంతు డొడ్లు తన కొండపకారము సేయునప్పుడుం
బహిరతమే యొనర్చు నొక పట్టున నైనను గీడుఁ జేయగా
నెఱుగడు; నిక్కమేకద యదెట్లనఁ గవ్వముబట్టి యొంతయున్
దరువగ జొచ్చినం బెరుగు తాలిమినీయదె వెన్న భాస్కరా!
- మారద వెంకయ్య
పదవిభాగం:
ఉరుగుణవంతుడు, ఒడ్లు, తనకున్, ఓండు + అపకారము, చేయునప్పుడున్,
పరహితమే, ఒనర్చున్, ఒక పట్టున్ + ఐనను, కీడున్, చేయగాన్,
ఎఱుగడు, నిక్కమేకద, అది + ఎట్లు + అనన్, కవ్వము + పట్టి, ఎంతయున్,
తరువగ + చొచ్చినన్, పెరుగు, తాలిమిన్, ఈయదె, వెన్నన్, భాస్కరా!
ప్రతిపదార్ధము:
భాస్కరా! = ఓ సూర్యుడా
ఉరుగుణవంతుడు = గొప్ప గుణవంతుడు
ఒడ్లు = ఇతరులు
తనకున్ = తనకు
ఓండు + అపకారము = ఒక అపాయము
చేయునప్పుడున్ = చేసినప్పుడు కూడా
పరహితమే = ఇతరులకు మేలునే
ఒనర్చున్ = చేస్తాడు
ఒక పట్టున్ + ఐనను = ఏ సమయమునందైనను
కీడున్ = అపాయమును
చేయగాన్ = చేయటానికి
ఎఱుగడు = ఇష్టపడడు
నిక్కమేకద = అది నిజమే కదా
అది + ఎట్లు + అనన్ = అది ఎలా అంటే
కవ్వము + పట్టి = కవ్వము చేతితో పట్టుకుని
ఎంతయున్ = మిక్కిలి అధికముగా
తరువగ + చొచ్చినన్ = చిలుకుతున్నప్పటికీ
పెరుగు = పెరుగు
తాలిమిన్ = ఓర్పుతో
వెన్నన్ = వెన్నను
ఈయదె = ఇవ్వటం లేదా
భావం:
భాస్కరా! చాలా మంచి గుణాలు కలవాడు పరులు తనకు కీడు తలపెట్టినా ఓర్పు వహించి వారికి ఏమాత్రమూ అపకారము చేయక తాను పరోపకారమే చేస్తాడు. ఎలాగంటే, పెరుగును కవ్వంచేత చిలుకుతూంటే ఫలితంగా అది కమ్మని వెన్నను ఇస్తుందికదా!
Andhra Pradesh 10th Class Telugu 6th Lesson Shataka Madhurima
In this episode we will cover the Telugu poem (Telugu padyam) written by the Vaddadi Subbarayakavi "Thana Desambu Svabhasha Naijamathamun”
తన దేశంబు స్వభాష నైజమతమున్ అస్మత్సదాచారముల్
తన దేహాత్మల నెతైఱంగున సదా తానట్లు ప్రేమించి, త
ద్ఘనతావాప్తికి సాధనంబులగు సత్కార్యమ్ములన్ జేయగా
ననువౌ బుద్ది యొసంగుమీ ప్రజకు దేవా! భక్త చింతామణీ!
వడ్డాది సుబ్బరాయకవి
పదవిభాగం:
తన, దేశంబున్, స్వభాషన్, నైజమతమున్, అస్మత్, సత్ + ఆచారముల్,
తన, దేహ + ఆత్మలన్, ఏ + తెఱుంగున, సదా, తాను, అట్లు, ప్రేమించి,
తత్, ఘనతా + అవాప్తికిన్, సాధనంబులు + అగు, సత్ + కార్యమ్ములన్, చేయగాన్,
అనువౌ, బుద్దిన్, ఒసంగుమీ, ప్రజకున్, దేవా!, భక్త చింతామణీ!
ప్రతిపదార్ధము:
భక్త చింతామణీ = భక్తులకు చింతామణి రత్నమువలే కోరికలు ఇచ్చేవాడా
దేవా = ఓ దైవమా
తన = తన యొక్క
దేహ + ఆత్మలన్ = శరీరమును, మనసును
ఏ + తెఱంగున = మనిషి ఏవిధంగా ప్రేమిస్తాడో
అట్లు = అదేవిధంగా
తన దేశంబున్ = తన యొక్క దేశమును
స్వభాషన్ = తన యొక్క భాషను
నైజమతమున్ = తన యొక్క మతమును
అస్మత్ = తనయొక్క
సత్ + ఆచారముల్ = మంచి సాంప్రదాయములను
సదా = ఎల్లప్పుడూ
తాను = తాను
ప్రేమించి = అభిమానించి
తత్ = అవి
ఘనతా + అవాప్తికిన్ = గొప్పదనము కలిగించడానికి
సాధనంబులు + అగు = సాధనాలైనటువంటి
సత్ + కార్యమ్ములన్ = మంచిపనులను
చేయగాన్ = చేయటానికి
అనువౌ = తగినటువంటి
బుద్దిన్ = మనసును
ప్రజకున్ = దేశ ప్రజలకు
ఒసంగుమీ = కలుగ జేయుమా
భావం: భక్తుల పాలిట చింతామణియైన ఓస్వామీ! ఎవరైనా తన శరీరాన్ని ఆత్మను ఎట్లా అభిమానిస్తాడో, అలాగే, తన దేశాన్ని, తన భాషను, మతాన్ని, ఆచారాన్ని కూడా అభిమానించేటట్లు, వాటి ఔన్నత్యానికి సాధనాలైన మంచి పనులను చేసేటట్లు తగిన బుద్దిని ప్రజలకు ప్రసాదించు.
In this episode we will cover the Telugu poem (Telugu padyam) written by the Tharigonga Vengamamba "Pattuga Neeshvarundu”
పట్టుగ నీశ్వరుండు తన పాలిట నుండిపుడిచ్చినంతలో
దిట్టక దీనాదేహులను దేటగ లాలనజేసి, యన్నమున్
బెట్టు వివేకి మానసము బెంపొనరించుచు నూరకుండినన్
గుట్టుగ లక్షిబొందు; దరిగొండనృసింహ! దయాపయోనిధీ!
తరిగొండ వెంగమాంబ
పదవిభాగం:
పట్టుగన్, ఈశ్వరుండు, తన పాలిటన్, ఉండి, ఇపుడు, ఇచ్చినంతలోన్,
తిట్టక, దీనాదేహులను, తేటగ, లాలనన్ + చేసి, అన్నమున్,
పెట్టు, వివేకి, మానసమున్, పెంపు + ఒనరించుచున్, ఊరక + ఉండినన్,
గుట్టుగన్, లక్ష్మిన్, పొందున్, తరిగొండనృసింహ, దయాపయోనిధీ.
ప్రతిపదార్ధము:
దయాపయోనిధీ = దయకు సముద్రుడువైన వాడా (సముద్రమంత గొప్ప దయ కలిగిన వాడా)
తరిగొండనృసింహ = తరిగొండ గ్రామంలో వెలసిన ఓ నృసింహస్వామి
ఈశ్వరుండు = భగవంతుడు
పట్టుగన్ = దృఢంగా
తన పాలిటన్ = తన పక్షమున
ఉండి = నిలిచి
ఇపుడు = ఈ జన్మలో
ఇచ్చినంతలోన్ = ప్రసాదించిన దానిలోనే
తిట్టక = నిందించకుండా
దీనాదేహులను = నిరుపేదలను
తేటగ = ఆప్యాయంగా
లాలనన్ + చేసి = బుజ్జగించి
అన్నమున్ = అన్నమును
పెట్టు = పెట్టునటువంటి
వివేకి = వివేకవంతుడు
మానసమున్ = తన యొక్క మనసును
పెంపు + ఒనరించుచున్ = ఆనందింపచేసుకుంటూ
ఊరక + ఉండినన్ = అడగకుండా ఊరక ఉన్నప్పటికీ
గుట్టుగన్ = రహస్యముగా
లక్ష్మిన్ = ఐశ్వర్యమును
పొందున్ = పొందుతాడు
భావం: దయాసముద్రుడా! తరిగొండనృసింహదేవా! వివేకి అయినవాడు తనకు భగవంతుడు ప్రసాదించిన దానిలో - అనాథలను, నిరుపేదలను కసరుకోక ఆప్యాయతతో లాలిస్తూ అన్నం పెడతాడు. అలాంటి సహృదయుణ్ణి సంపదలకు అధిదేవత అయిన లక్ష్మి గుట్టుచప్పుడు కాకుండా వచ్చి వరిస్తుంది. దీనులకు చేసే అన్నదానానికి ఇంతటి ప్రాశస్త్యం ఉందని తాత్పర్యం.
The podcast currently has 48 episodes available.